
ప్రభుత్వ పాఠశాలలకు ఇంకా చేరని టెక్ట్స్‌బుక్కులు
ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం అందుబాటులోకి..
ఇంకా కానరాని ఆంగ్ల మాధ్యమం
అన్ని తరగతులకూ బిడ్జి కోర్సులే..
కొత్త క్లాసులు జూలై నుంచి ప్రారంభ మయ్యే అవకాశం
కృష్ణకాలనీ, జూన్ 22: పాఠశాలలు తెరుచుకున్నా యి. క్లాసులు స్టార్ట్ అయ్యాయి. పాఠశాలలు పునఃప్రారంభించి పది రోజులవుతున్నాయి. అయినా సర్కారు బడులకు ఇంకా పాఠ్యపుస్తకాలు చేరలేదు. దీంతో విద్యాబోధన కష్టతరంగా మారింది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం తప్ప క్లాసులు వినే పరిస్థితి లేదు. మరోవైపు ఈఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనుండగా ఇంకా దాని ఊసే కానరావ డం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. వాటితో పాటు విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులు బయట కొనుగోలు చేయకుండా స్కూల్స్‌లోనే ప్రత్యేక కౌంటర్ల ద్వారా అంటగడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 542 పాఠశాలలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల్లో 542 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాలలు 482, ప్రైవేటు పాఠశాలలు 70 ఉన్నాయి. 2021-22 విద్యా సంవత్సరంలో జిల్లాలో 540 పాఠశాలలు ఉండగా ప్రభుత్వం ఈ ఏడాది 2022-23 విద్యా సంవత్సరానికి చిట్యాల మండలంలోని వరికోలు పల్లిలో ప్రైమరీ పాఠశాల, అలాగే టేకుమట్ల మండలం బూర్నపెల్లిలో మరో ప్రైమరీ పాఠశాలను అందుబాటులో తెచ్చారు. దీంతో అద నంగా ఈ విద్యా సంవత్సరం రెండు పాఠశాలలు వచ్చినట్లు అయింది. వీటితో జిల్లా విద్యాశాఖ పరిధిలో 11 కేజీబీవీ పాఠశాలలు, ఆరు మోడల్ స్కూల్స్, ఒకటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూలు ఉన్నాయి.
క్లాసులు సాగేదెట్లా..?!
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ఈ నెల 12న పునఃప్రారంభమయ్యాయి. క్లాసులు మొదలైనా ఇప్పటి వరకు పుస్తకాలు మాత్రం అరకొరగానే పాఠశా లలకు చేరలేదు. జిల్లా వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 2,26,153 పుస్తకాల సెట్లు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 23,000 మాత్రమే వచ్చాయి. ఇంకా 2,03,153 పుస్తకాలు రావాల్సి ఉంది.
కానరాని ఇంగ్లిషు చదువు
ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠ శాలల్లో ఆంగ్లమాంధ్యమాన్ని (ఇంగ్లిష్ మీడియం) ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు పాఠశాలల్లో అది కానరావడం లేదు. తరగతులు కూడా నామమాత్రంగానే సాగుతున్నట్లు సమాచారం. ఆంగ్ల మాంధ్యమానికి సంబంధించి పుస్తకాలు పూర్తి స్థాయిలో చేరకపోవడంతో చదువులు సాగేనా..? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతు న్నాయి. అయితే.. ఈ ఏడాది ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవే శపెట్టడంతో ఉన్నట్టుండి ఒక్కసారి అంతా ఇంగ్లిషు లోనే పాఠ్యపుస్తకాలు ఉంటే విద్యార్థులు ఇబ్బంది పడ తారని ప్రభుత్వం భావించింది. ఒకవైపు తెలుగు, మరో వైపు ఇంగ్లిషులో పుస్తకాలు ముద్రిస్తోంది. ఈ నేప థ్యంలోనే పాఠ్యపుస్తకాలు చేరడంలో ఆలస్యమవు తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ‘బిడ్జి’ తరగతులు..
ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ప్రస్తుతం బిడ్జి కోర్సు తరగతులు నడుస్తున్నాయి. కరోనా నేపథ్యం లో విద్యార్థులంతా చాలా వరకు చదువుకు దూరమ య్యారు. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో చేరే విద్యార్థులకు బిడ్జి కోర్సులు నిర్వహిస్తున్నారు. అంటే.. గత తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాన్నే బోధి స్తున్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ తరహా బోధనే ఉండటంతో 30 రోజులకు సరిపడా బుక్లెట్లను ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం ఆ తరగతులే కొనసా గుతుండగా నూతన విద్యా సంవత్సరం జూలైలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘ప్రైవేటు’ దోపిడీ!
జిల్లాల వ్యాప్తంగా 70 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే వీటిలో అత్యధిక విద్యా సంస్థల్లో అధిక ఫీజులతో పాటు పుస్తకాలపై భారీగా దండుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నా యి. వేలాది రూపాయల ఫీజుల రూపంలో తీసు కుంటుండగా పాఠ్య పుస్తకాలతో పాటు విద్యార్థులకు అవసరమయ్యే ఇతర వస్తువులకు కూడా ప్రత్యేక ప్యాకేజీని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొత్తగా అడ్మి షన్ పొందేందుకు వేలల్లో ప్రత్యేక ఫీజులు తీసు కుంటున్నట్టు కంపాక్స్ బాక్సు, పెన్నులు, నోట్ బుక్కులు, యూనిఫాం, షూ, టై, బెల్టు తదితర వస్తు వులు ఇక్కడ కొనుగోలు చేయాల్సిందే. ప్రైవేటు పాఠ శాలల్లోనే చదువులు బాగా అబ్బుతాయనే అభిప్రా యంతో విద్యార్థుల తల్లిదండ్రులు భారీ ఖర్చులను సైతం భరిస్తున్నారని తెలుస్తోంది. పేద, మధ్యతరగతి వారు సైతం అష్టకష్టపడి చదివించడమే కాకుండా ఫీజుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. అయితే.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టిన సర్కారు ప్రైవేటుకు దీటుగా విద్యాబోఽధన ఉంటుందని చెబుతోంది. కార్పొరేట్ స్థాయిలో పాఠశా లలను తీర్చిదిద్దుతున్నామని అంటోంది. అయినా అలాంటి మెరుగైన పరిస్థితులు ప్రభుత్వం పాఠశా లల్లో ఇప్పటి వరకైతే ఎక్కాడా కానరావడం లేదు.