TS News: రేవంత్ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యానికి వందనం’ - జూమ్ మీటింగ్‌లో పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం

ABN , First Publish Date - 2022-08-20T02:24:36+05:30 IST

Hyderabad: మునుగోడు ఉప ఎన్నిక (Munugodu bypoll) నేపథ్యంలో కాంగ్రెస్ అనుసరించాల్సిన విధానాన్ని పార్టీ నాయకులకు వివరించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy). జూమ్

TS News: రేవంత్ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యానికి వందనం’  - జూమ్ మీటింగ్‌లో పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం

Hyderabad: మునుగోడు ఉప ఎన్నిక (Munugodu bypoll) నేపథ్యంలో కాంగ్రెస్ అనుసరించాల్సిన విధానాన్ని పార్టీ నాయకులకు వివరించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy). జూమ్ మీటింగ్‌లో బీజేపీ(BJP), టీఆర్ఎస్(TRS) తీరును వివరిస్తూనే..ప్రజాస్వామ్య పరిరక్షణకు చేపట్టాల్సిన కార్యక్రమం గురించి పార్టీ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు.


‘‘లక్ష మంది‌కి వందనం’’

మునుగోడు నియోజక వర్గంలో బీజేపీ, టీఆర్ఎస్ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయి. నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. దేశంలో ఎన్నడూ, ఎక్కడ లేని విధంగా రాజకీయ దుర్మార్గానికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ దుర్మార్గాలు శ్రుతి మించిపోయాయి.. ఎదుర్కోడానికి మనం ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. అందులో భాగంగానే..‘ప్రజాస్వామ్యానికి వందనం’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నాతో సహా వెయ్యి మంది నాయకులు లక్ష మంది‌కి వందనం చేయడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడాలి. 


మునుగోడులో ఘనంగా రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) జయంతి

రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. పొర్లుగడ్డ తండాలో ఆయన రాజీవ్ గాంధీకి నివాళి అర్పిస్తారు. మునుగోడు నియోజకవర్గంలో రాజీవ్ జయంతి వేడుకల నిర్వహణపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ‘‘ రేపు మునుగోడు నియోజక వర్గంలో దివంగత రాజీవ్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహిద్దాం. ఉదయం ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పార్టీ జెండాలు ఎగురవేసి రాజీవ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించాలి. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన  సేవల గురించి ప్రజలకు వివరించాలి.’’ అని రేవంత్ వివరించారు.

Updated Date - 2022-08-20T02:24:36+05:30 IST