TS News : హిందువుల పండగలను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోం: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-09-05T21:55:44+05:30 IST

Hyderabad: కేసీఆర్ (CM KCR) సర్కారు నిబంధనల పేరుతో హిందువుల పండగలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తోందని బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. దీన్ని హిందూ సమాజం గమనించాలని ఆయన కోరారు. ‘ టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వ హయాంలో ఏటా వినాయక నిమజ్జనం ఉత్కంఠ వాతావరణంలో జరుపుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్‌లో నిమజ్జనం చేయాలంటే అనేక పర్మిషన్స్ తీసుకోవాలి. హిందువుల పండుగ అంటే పీస్ కమిటీ మీటింగ్ పెడతారు. మూడు రోజుల్లో నిమజ్జనం ఉంది అయితే ప్రభుత్వం

TS News : హిందువుల పండగలను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోం: బండి సంజయ్

 Hyderabad: కేసీఆర్ (CM KCR) సర్కారు నిబంధనల పేరుతో హిందువుల పండగలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తోందని బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. దీన్ని హిందూ సమాజం గమనించాలని ఆయన కోరారు. ‘ టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వ హయాంలో ఏటా వినాయక నిమజ్జనం ఉత్కంఠ వాతావరణంలో జరుపుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్‌లో నిమజ్జనం చేయాలంటే అనేక పర్మిషన్స్ తీసుకోవాలి. హిందువుల పండుగ అంటే పీస్ కమిటీ మీటింగ్ పెడతారు. మూడు రోజుల్లో నిమజ్జనం  ఉంది అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఏర్పాట్లు చేయలేదు. సీఎస్ సోమేష్ కుమార్ కోర్టు (Somesh Kumar) ఉత్తర్వులు కూడా పట్టించుకోలేదు. కోవిడ్ సమయం‌లో రంజాన్ పండుగను పాత బస్తీ‌లో నిర్వహించారు... మేము ఎక్కడ దానికి అడ్డూ చెప్పలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల పేరుతో నిమజ్జనం అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ సారి ట్యాంక్ బండ్‌ మీద కాదు. ప్రగతి భవన్‌లో జరుగుతాయని’’ హెచ్చరించారు.

 

‘‘ఉపాధ్యాయుల అరెస్ట్ సిగ్గుచేటు’’

‘13 జిల్లాలో ఉపాధ్యాయు దినోత్సవం రోజున కూడా ఉపాధ్యాయులను అరెస్ట్ చేయటం సిగ్గు చేటు. ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన 317 జీవోను సవరించాలి. వారికి భేషరతుగా క్షేమాపన చెప్పాలి.’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.  

Updated Date - 2022-09-05T21:55:44+05:30 IST