TS News: మోదీ వైఫల్యాలను కేసీఆర్ నిలదీస్తున్నారు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-09-03T01:22:22+05:30 IST

Hyderabad: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Seetaraman) కామారెడ్డి జిల్లాల్లో రెండు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR) పాలన తీరుపై ఆమె విమర్శలు చేశారు. ప్రజలకు కేంద్రం వాటాగా ఉచితంగా బియ్యం ఇస్తున్నపుడు ప్రధాని మోదీ (Modi) ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి తెలియకుండానే లెక్కకు మించి అప్పులు చేస్తున్నారని

TS News: మోదీ వైఫల్యాలను కేసీఆర్ నిలదీస్తున్నారు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

Hyderabad: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Seetaraman) కామారెడ్డి జిల్లాల్లో రెండు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR) పాలన తీరుపై ఆమె విమర్శలు చేశారు. ప్రజలకు కేంద్రం వాటాగా ఉచితంగా బియ్యం ఇస్తున్నపుడు ప్రధాని మోదీ (Modi) ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి తెలియకుండానే లెక్కకు మించి అప్పులు చేస్తున్నారని తెలిపారు. అప్పుల భారం ప్రజలపైనే పడుతుందన్నారు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) స్పందించారు. ‘‘మోదీ వైఫల్యాలను కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో ఎండగడుతుంటే బీజేపీ భయపడుతుంది. కేంద్రానికి అధికంగా నిధులిస్తోన్న రాష్ట్రం తెలంగాణ. ఆ డబ్బుతో మిగతా రాష్ట్రాల్లో కేంద్రం అభివృద్ధి పనులు చేస్తోంది. మరి ఆ రాష్ట్రాల్లో కేసీఆర్ ఫోటో పెడతారా?’’ అని ప్రశ్నించారు. 

Updated Date - 2022-09-03T01:22:22+05:30 IST