TS News: అసోం సీఎం వ్యాఖ్యలను ఖండించిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-09-10T00:05:28+05:30 IST

Hyderabad: తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ (Himantha Biswa Sharma) తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR)పై కీలక వ్యాఖ్య‌లు చేశారు. మ‌రో 30 ఏళ్ల దాకా కేంద్రంలో బీజేపీ (BJP) స‌ర్కారే ఉంటుంద‌ని.. కేంద్రంలో విప‌క్షాల‌తో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌న్న కేసీఆర్ క‌ల నెర‌వేర‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానిం

TS News: అసోం సీఎం వ్యాఖ్యలను ఖండించిన మంత్రి తలసాని

Hyderabad: తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ (Himantha Biswa Sharma) తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR)పై కీలక వ్యాఖ్య‌లు చేశారు. మ‌రో 30 ఏళ్ల దాకా కేంద్రంలో బీజేపీ (BJP) స‌ర్కారే ఉంటుంద‌ని.. కేంద్రంలో విప‌క్షాల‌తో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌న్న కేసీఆర్ క‌ల నెర‌వేర‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. సూర్యుడి మీదో, చంద్రుడి మీదో... లేదంటే స‌ముద్రంలోనో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల‌న్న శ‌ర్మ‌... కేంద్రంలో అయితే కేసీఆర్ ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌డానికి అవ‌కాశ‌మే లేద‌న్నారు. అసోం సీఎం వ్యాఖ్యలపై  మంత్రి తలసాని (Talasani Srinivas) స్పందించారు. హిమంత బిశ్వ శ‌ర్మ వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు.


‘‘వినాయక నిమజ్జనం కార్యక్రమానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం సమంజసమా? ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదికపై అసోం సీఎం అలా మాట్లాడటం దురదృష్టకరం. మేం కూడా అసోం వెళ్లి మాట్లాడగలం.. కానీ మాకు సంస్కారం ఉంది. ఇలా మాట్లాడితే కార్యకర్తలే కాదు.. ప్రజలు కూడా తిరగబడతారు. ఇక గవర్నర్ తమిళిసై (Governor Tamilisi) తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. గవర్నర్ తన పరిధి గుర్తించాలని కోరుతున్నాం.మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి’’ అని పేర్కొన్నారు. గణేశ్‌ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని, రేపు సాయంత్రం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉందన్నారు. 

Updated Date - 2022-09-10T00:05:28+05:30 IST