TS News: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన శ్రవణ్

ABN , First Publish Date - 2022-08-05T23:27:59+05:30 IST

Hyderabad: కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) రాజీనామా చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్రవణ్ పార్టీ పదవి, సభ్యత్వానికి కూడా గుడ్ బై చెప్పారు. రాజీనామా చేయవద్దని కాంగ్రెస్ నేతల ఆయనను బుజ్జగించారు.

TS News: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన శ్రవణ్

Hyderabad: కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) రాజీనామా చేశారు.  ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్రవణ్ పార్టీ పదవి, సభ్యత్వానికి కూడా గుడ్ బై చెప్పారు. రాజీనామా చేయవద్దని  కాంగ్రెస్ నేతల ఆయనను బుజ్జగించారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్‌ పార్టీ తీరుపై దాసోజు శ్రవణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘రేవంత్‌ (Revanth Reddy) పీసీసీ చీఫ్‌ అయ్యాక పార్టీలో అరాచకాలు పెరిగాయి. టి.కాంగ్రెస్‌లో కులం, ధనానికే ప్రాధాన్యం పెరిగింది. పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారు. పార్టీలో అగ్రవర్ణ కుల దురహంకారం ప్రదర్శిస్తున్నారు. టి.కాంగ్రెస్‌కు ఎస్సీలు, బీసీలు దూరమయ్యారు. బడుగులను అణగదొక్కాలని చూస్తున్నారు. వ్యాపార, రాజకీయ లబ్ధి పొందాలనేదే రేవంత్‌ ఆరాటం. రేవంత్‌, మాణిక్కం ఠాగూర్‌, వ్యూహకర్త సునీల్‌ కుమ్మక్కయ్యారు. ప్రశ్నించినవారిపై హైకమాండ్‌కు తప్పుడు నివేదికలు అందిస్తున్నారు.’’ అని శ్రవణ్ పేర్కొన్నారు. 


ఇంకా ఏమన్నారంటే..

రేవంత్ రెడ్డిపై శ్రవణ్ విమర్శనాస్రాలు గుప్పించారు. ’’వ్యక్తిగత ఇమేజ్‌ పెంచుకోవడానికి రేవంత్‌ ప్రయత్నిస్తున్నారు. రేవంత్ పార్టీని ప్రైవేట్‌ ప్రాపర్టీగా మారుస్తున్నారు. ఏఐసీసీ నుంచి ఫ్రాంచైజీగా పార్టీని తెచ్చుకున్నట్లు రేవంత్‌ వ్యవహార శైలి ఉంది. రేవంత్‌రెడ్డి మాఫియాలా పార్టీని నడుపుతున్నారు. ప్రైవేట్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లా పార్టీని నడిపిస్తున్నారు.’’ అని శ్రవణ్ ఆరోపించారు.

Updated Date - 2022-08-05T23:27:59+05:30 IST