TS News: కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన కేంద్ర మంత్రులు

ABN , First Publish Date - 2022-09-16T22:23:31+05:30 IST

Hyderabad: సినీ నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు సంస్మరణ సభను హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహించారు. క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు రాజనాథ్ సింగ్, కిషన్ రెడ్డి, మంత్రి తలసాని, ఏపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తదితరులు

TS News: కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన కేంద్ర మంత్రులు

Hyderabad: సినీ నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు సంస్మరణ సభను హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహించారు. క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, మంత్రి తలసాని, ఏపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ..

‘‘కృష్ణంరాజుని నేను అన్నగారు అనే సంభోదించేవాడిని.  కృష్ణం రాజు దశదిన కర్మ రోజున వద్దామనుకున్నా. కానీ షెడ్యూల్ బీజీ కారణంగా ఈ రోజు వచ్చాను. బాహుబలి సినిమా చూడాలని కృషంరాజు కోరారు. సినిమా చూశాం. బాగుంది. కృష్ణంరాజు మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు. కృష్ణంరాజు తెలుగు ప్రజలకు రాజకీయ నాయకుడు. సినిమా స్టార్. రెబల్ స్టార్ కానీ  గ్రామంలో మాత్రం తాను అందరికీ సొంత వ్యక్తి.’’ అని పేర్కొన్నారు. 


కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..‘ కృష్ణంరాజు మృత్యువార్త తెలిసి రాజ్‌నాథ్ సింగ్ కాల్ చేసి ప్రభాస్ నంబర్ అడిగారు. ప్రభాస్‌తో ఫోన్లో మాట్లాడినా తన మనసులో వెలితి ఉందని, వాళ్ల కుటుంబాన్ని కలుద్దామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కృష్ణంరాజు ఇటీవలే నాకు కాల్ చేసి ప్రధానిని కలవాలి అన్నారు. అల్లూరి విగ్రహం ఆవిష్కరణకు భీమవరం వస్తానని కృష్ణంరాజు అన్నారు.  కృష్ణంరాజు తన ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్ళడానికి మేం అన్ని ఏర్పాట్లు చేశాం. కరోనా వల్ల వెళ్ళలేకపోయారు. కల్మషం లేని వ్యక్తి కృష్ణంరాజు.’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.  


మంత్రి తలసాని మాట్లాడుతూ.. ‘ఫిలింనగర్ సొసైటీలో కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత విలక్షణ నటుడు కృషంరాజు. అందరూ చనిపోతారు. కొంతమందే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారిలో ఒకరు కృష్ణంరాజు.  నేను చిన్నప్పుడు కృష్ణంరాజు సినిమాలు చూసాను. మర్యాదకు మారుపేరు రాజు. ప్రభాస్ కూడా కృష్ణంరాజు స్థాయికి ఎదిగాడు.’’ అని పేర్కొన్నారు.  

Updated Date - 2022-09-16T22:23:31+05:30 IST