TS News: సమ్మె తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం : వీఆర్ఏ ప్రతినిధులు

ABN , First Publish Date - 2022-09-13T22:10:51+05:30 IST

Hyderabad: పే స్కేల్ (Pay Scale) అమలు, అర్హులకు ప్రమోషన్లు (Pramotions), 55 సంవత్సరాల వయసు దాటిన వారి వారసులకు ఉద్యోగాలు తదితర డిమాండ్లతో గత కొన్ని రోజులుగా వీఆర్‌ఏ(VRA)లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ (KTR), సీఎస్ సో

TS News: సమ్మె తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం : వీఆర్ఏ ప్రతినిధులు

Hyderabad: పే స్కేల్ (Pay Scale) అమలు, అర్హులకు ప్రమోషన్లు (Promotions), 55 సంవత్సరాల వయసు దాటిన వారి వారసులకు ఉద్యోగాలు తదితర డిమాండ్లతో గత కొన్ని రోజులుగా వీఆర్‌ఏ(VRA)లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ (KTR), సీఎస్ సోమేష్ కుమార్ (Somesh Kumar) వీఆర్ఏ ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు. సమావేశం అనంతరం వీఆర్ఏ ముఖ్య ప్రతినిథులు మాట్లాడుతూ..‘‘ మా హక్కుల కోసం 50 రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. మంత్రి కేటీఆర్ మాతో చర్చలు జరిపారు. గతంలో కేసీఆర్ (CM KCR) మాకు ఇచ్చిన హమీల గురించి ఆయనకు వివరించాం. 20వతేది జాయింట్ మీటింగ్ ఉంది. ముఖ్యమంత్రి, మంత్రి, ఉన్నతాధికారులపై మాకు నమ్మకం ఉంది. గ్రామాల్లో వీఆర్ఏలపై చాలా భారం పడుతుంది. వీఆర్వో వ్యవస్థ రద్దు అయ్యాక జాబ్ చార్ట్‌లో లేని విధులను కూడా మాతో చేయిస్తున్నారు. ప్రతిపక్షాలు మాకు సహకరించడం లేదు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా.. ఉన్నతాధికారుల నిర్లక్షం వల్లే మాకు ఇచ్చిన హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. మా హామీలపై జీవో వచ్చాకే సమ్మె విరమించాలని  అనుకున్నాం. కాని కేటీఆర్ హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. రేపటి నుంచి 20వ తేదీ వరకు నిరసన శిబిరాల్లో మా కార్యక్రమాలు శాంతియుతంగా కొనసాగిస్తాం’’ 

Updated Date - 2022-09-13T22:10:51+05:30 IST