దుఃఖాన్ని దిగమింగుకొని..

ABN , First Publish Date - 2021-06-15T09:25:16+05:30 IST

ఫైనల్‌ ఆరంభానికి మరో ఐదే నిమిషాలు.. అంతలోనే తాను ఎంతగానో ప్రేమించే నాయనమ్మ మరణ వార్త.. ఇంతటి తీవ్ర విషాదంలో ఉన్నా.. ఆ బాధను దిగమింగుకుని జొకోవిచ్‌ తో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో...

దుఃఖాన్ని దిగమింగుకొని..

  • ఫైనల్‌కు 5 ని. ముందు నాయనమ్మ మృతి

పారిస్‌: ఫైనల్‌ ఆరంభానికి మరో ఐదే నిమిషాలు.. అంతలోనే తాను ఎంతగానో ప్రేమించే నాయనమ్మ మరణ వార్త.. ఇంతటి తీవ్ర విషాదంలో ఉన్నా.. ఆ బాధను దిగమింగుకుని జొకోవిచ్‌ తో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో గొప్ప పోరాట పటిమను ప్రదర్శించాడు గ్రీస్‌ ఆటగాడు స్టెఫనోస్‌ సిట్సిపాస్‌. దాంతో తన రన్నరప్‌ టైటిల్‌ను నాయనమ్మకు అంకితమిస్తున్నట్టు 22 ఏళ్ల సిట్సిపాస్‌ చెప్పాడు. ‘నాకు ఓ మంచి తండ్రిని ఇచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు. నాన్న సహకారం, ప్రోత్సాహం లేకపోతే నేను ఇంత వరకు వచ్చేవాడినే కాదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో సిట్సిపాస్‌ భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశాడు. 


Updated Date - 2021-06-15T09:25:16+05:30 IST