
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీలో ఎండీ సజ్జనార్ తన మార్క్ చూపిస్తున్నారు. బస్టాండుల్లో అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులకు జరిమానా విధిస్తున్నారు. ప్రత్యేక బృందాలు, అధికారులతో కలిసి జేబీఎస్- ఎంజీబీఎస్‌తో పాటు జిల్లాలోని బస్టాండ్స్‌లో తనిఖీలు నిర్వహించారు. ఎమార్పీ ధరల కంటే ఎక్కువ వసూళ్లు చేస్తోన్న షాప్స్‌కు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు అధికారులు జరిమానా విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు షాప్స్‌కి ఆర్టీసీ ఉన్నతాధికారులు జరిమానా విధించారు.