సర్వదర్శనం టోకెన్లకు పోటెత్తిన భక్తులు

Sep 25 2021 @ 04:14AM

అయిపోయిన విషయం తెలియక అవస్థలు 

తిరుపతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఉచిత దర్శనాల టోకెన్ల కోసం శుక్రవారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. టోకెన్లు అయిపోయిన విషయం తెలియక ఉదయమే తిరుపతిలోని శ్రీనివాసం అతిథి గృహానికి చేరుకున్న వీరంతా అవస్థలు పడాల్సి వచ్చింది. పెరటాసి నెల శనివారాలు కావడంతో తమిళనాడు నుంచి భక్తులు ఎక్కువగా వచ్చారు. అయితే 24వ తేదీ టోకెన్లను 22నే కేటాయించేసిన టీటీడీ ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయలేదు. కనీసం అధికారికంగా పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఈ విషయం తెలియక శ్రీనివాసం వద్దకు చేరుకున్న వారిని టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది, పోలీసులు బలవంతంగా ఆర్టీసీ బస్టాండు లోపలకు పంపేశారు. టికెట్లు ఇవ్వడం లేదని ముందుగా ఎందుకు సమాచారం తెలియజేయలేదని మీడియా ద్వారా టీటీడీని పలువురు భక్తులు నిలదీశారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.