
తిరుమల : భారీ వర్షాల కారణంగా గతేడాది నవంబరు 18 నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు దర్శన టికెట్లు కలిగివుండి తిరుమలకు రాలేని భక్తుల సౌకర్యార్థం టీటీడీ రీషెడ్యూల్కు మరో అవకాశం కల్పించింది. భక్తుల విజ్ఞప్తి మేరకు రానున్న ఆరు నెలల్లో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటును కల్పించింది. అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగనున్న నేపథ్యంలో ఈ తేదీలు మినహాయించి ఆరు నెలల్లోపు తమకు కావాల్సిన తేదీల్లో పాత టికెట్ నెంబరు ద్వారా నూత న టికెట్లు పొందవచ్చని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి