
తిరుమల: లగేజీ కౌంటర్లలో భక్తుల ఇబ్బందులపై ABN ప్రసారం చేసిన కథనాలకు TTD స్పందించింది. సోమవారం లగేజీ కౌంటర్లలో టీటీడీ అదనపు సిబ్బందిని నియమించింది. లగేజీ కౌంటర్ పర్యవేక్షణ బాధ్యతలు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు టీటీడీ ఈవో ధర్మారెడ్డి అప్పగించారు. త్వరలోనే లగేజీ కౌంటర్లను ప్రైవేట్ ఏజెన్సీకి కేటాయిస్తామన్నారు. త్వరలోనే స్లాటడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని ప్రారంభిస్తామని చెప్పారు. టోకెన్ల కోటా పూర్తైన అనంతరం క్యూ కాంప్లెక్స్ గుండా.. భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. సర్వదర్శనం భక్తులకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ధర్మారెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి