TTD సలహా మండలి సభ్యుడిగా ఆనందకుమార్‌ రెడ్డి ప్రమాణం

ABN , First Publish Date - 2022-02-12T13:37:28+05:30 IST

టీటీడీ చెన్నై సమాచారకేంద్ర సలహామండలి సభ్యుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కె.ఆనందకుమార్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. టి.నగర్‌ వెంకటనారాయణ రోడ్డులో వున్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో సలహామండ

TTD సలహా మండలి సభ్యుడిగా ఆనందకుమార్‌ రెడ్డి ప్రమాణం

చెన్నై: టీటీడీ చెన్నై సమాచారకేంద్ర సలహామండలి సభ్యుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కె.ఆనందకుమార్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. టి.నగర్‌ వెంకటనారాయణ రోడ్డులో వున్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరిం చారు. ఆయనతో పాటు మరో సభ్యుడు స్వతంత్రన్‌ కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పీవీఆర్‌ కృష్ణారావు, మోహన్‌రావ్‌, మాజీ ఉపాధ్యక్షుడు అనిల్‌ కుమార్‌రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్‌ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. సలహా మండలిలో అధ్యక్షుడిగా ఏజే శేఖర్‌ గత ఏడాదే బాధ్యతలు స్వీకరించగా, ముగ్గురు ఉపాధ్యక్షులు, 19మంది సభ్యులు ఈ నెల 6వ తేదీన ప్రమాణం చేశారు. అనివార్య కారణాలతో ఆ రోజు హాజరుకాలేకపోయిన ఇద్దరు సభ్యులు కూడా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. 

Updated Date - 2022-02-12T13:37:28+05:30 IST