గరుడ వాహన సేవ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-10-01T15:43:31+05:30 IST

నేటి రాత్రి 7 గంటలకు శ్రీవారి గరుడ వాహన సేవను టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో

గరుడ వాహన సేవ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

తిరుమల : నేటి రాత్రి 7 గంటలకు శ్రీవారి గరుడ వాహన సేవను టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. గరుడ సేవకు 5 వేల మంది పోలీసులతో భద్రత నిర్వహించనున్నారు. మాడవీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నారు. గరుడ సేవలో టీటీడీ హారతులను రద్దు చేసింది. భక్తుల దర్శనానికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. గరుడ సేవ సందర్భంగా తిరుమలకు ప్రతి నిమిషానికి 2 బస్సులను ఏర్పాటు చేసింది. రేపు మధ్యాహ్నం వరకు ఘాట్ రోడ్లలో బైక్లను అధికారులు నిలిపివేశారు. 

Updated Date - 2022-10-01T15:43:31+05:30 IST