రేపటి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు

Published: Wed, 13 Apr 2022 21:15:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రేపటి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నుంచి మూడురోజుల పాటు సాలకట్ల వసంత్సోవాలు జరగనున్నాయి. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి మలయప్పస్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. తర్వాత వసంతమండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండవరోజైన శుక్రవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి మాడవీధుల్లో మలయప్పస్వామి ఊరేగుతారు. తర్వాత  వసంతోత్సవాలు నిర్వహిస్తారు. చివరిరోజైన శనివారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులకు వసంతోత్సవాలు నిర్వహిస్తారు. రోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామి,అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.