Tirumala కొండపైకి అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫొటోలు నిషేధం: టీటీడీ

ABN , First Publish Date - 2022-05-08T01:40:18+05:30 IST

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు

Tirumala కొండపైకి అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫొటోలు నిషేధం: టీటీడీ

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమత ప్రచారానికి సంబంధించిన సామాగ్రి తీసుకురావడం నిషిద్ధమని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయాలను కొన్ని దశాబ్దాల నుంచి అమలుచేస్తున్నామని టీటీడీ తెలిపింది. టీటీడీ భద్రతా సిబ్బంది అలిపిరి వద్ద అలాంటి వాహనాలను తిరుమలకు అనుమతించరని చెప్పారు. ఇటీవల తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనారాహిత్యంతో వ్యక్తుల ఫొటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయపార్టీల జెండాలతో వస్తున్నారని టీటీడీ వివరించింది. ఈ అంశాలను విజిలెన్స్‌ సిబ్బంది వాహనదారులకు తెలిపి వాటిని తీసివేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. టీటీడీ నిబంధనలను పాటించి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

Read more