TTD పాలకమండలి నిర్ణయాలివే

ABN , First Publish Date - 2022-07-11T22:59:35+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమావేశమైంది.

TTD పాలకమండలి నిర్ణయాలివే

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమావేశమైంది. చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (Chairman YV Subbareddy) ఆధ్వర్యంలో సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి భక్తుల సమక్షంలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న శ్రీవారికి పట్టువస్త్రాలు సీఎం జగన్ (CM Jagan) సమర్పిస్తారు. రద్దీ తగ్గేవరకు సర్వదర్శన భక్తులకు ప్రస్తుత విధానం కొనసాగుతుందని పాలకమండలి ప్రకటించింది. దేశవ్యాప్తంగా వైభవోత్సవాలు నిర్వహించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 నుంచి 20 వరకు నెల్లూరులో వైభవోత్సవాలు నిర్వహంచాలను నిర్ణయం తీసుకున్నారు. యంత్రాల సాయంతో లడ్డూ ప్రసాద బూందీ తయారీపై అధ్యయనం చేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2022-07-11T22:59:35+05:30 IST