Advertisement

‘ట‌క్‌జ‌గ‌దీష్’ మళ్లీ ఆగిందా..?

Oct 19 2020 @ 08:16AM

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘టక్ జగదీష్’. కోవిడ్ ప్ర‌భావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్ మ‌ళ్లీ అక్టోబ‌ర్ 5న రీస్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఈ సినిమా షూటింగ్‌ను మేక‌ర్స్ మ‌ళ్లీ ఆపార‌ట‌. అందుకు కార‌ణం.. యూనిట్‌లో ఓ టెక్నీషియ‌న్‌కి కోవిడ్ పాజిటివ్ రావ‌డ‌మేన‌ట‌. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా సినిమా షూటింగ్‌ను ఆపార‌ట‌. ప్ర‌స్తుతం టీమ్ అంతా హోం ఐసోలేష‌న్‌లో ఉంద‌ని టాక్‌. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూవ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్స్‌. ‘నిన్నుకోరి’ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.