Advertisement

‘టక్‌ జగదీష్‌’ టీజర్‌: రెండు నెలల్లో రొమ్ము ఇరుచుకుంటాది

Feb 23 2021 @ 18:04PM

నేచురల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోహీరోయిన్లుగా 'నిన్నుకోరి' వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని రూపొందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'టక్‌ జగదీష్‌'. 2021లో ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఒకటి. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని  షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 23న చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి మేకర్స్‌ స‌న్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 24 నాని బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మంగళవారం సాయంత్రం 5:04 గంట‌ల‌కు 'ట‌క్ జ‌గ‌దీష్' టీజ‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ టీజర్‌ రెగ్యులర్‌ టీజర్‌లకు భిన్నంగా, ఆసక్తికరంగా ఉంది.

 

ఓ పవర్‌ ఫుల్‌ సాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా.. నాని, నాని ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషన్స్‌ని హైలెట్‌ చేస్తూ టీజర్‌ని కట్‌ చేశారు. వెనుక ప్లే అవుతున్న సాంగ్‌ లిరిక్స్‌ కూడా సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో తెలిపేలా ఉండటం విశేషం. అలాగే నాని కూడా ఇది వరకు చేయని సరికొత్త పాత్రను చేసినట్లుగా టీజర్‌ చూస్తుంటే తెలుస్తుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ని ఈ చిత్రంలో దర్శకుడు చూపించబోతోన్నట్లుగా అర్థమవుతోంది. ముఖ్యంగా జగపతిబాబు, నాని రిలేషన్.. నాని, నాజర్‌ రిలేషన్‌ సినిమాకి ప్రధానాంశాలని టీజర్‌ చెప్పేస్తోంది. ఈ చిత్రానికి ఎస్‌. ఎస్‌. థమన్‌ సంగీతం, ప్రసాద్‌ మూరెళ్ల ఫొటోగ్రఫీ హైలెట్‌ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓవరాల్‌గా టీజర్‌ మాత్రం చక్కని పాటతో పాటు మంచి ఎమోషన్స్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. సినిమాపై అంచనాలను పెంచేసింది. నానికి పర్ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్ అనేలా ఉంది. కరెక్ట్‌గా రెండు నెలల్లో ఈ చిత్రం ఏ విధంగా రొమ్ము ఇరుచుకుని బాక్సాఫీస్‌ వద్ద నిలబడుతుందో తెలిసిపోనుంది.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.