మూడు నెలలకో తుగ్లక్‌ పని

ABN , First Publish Date - 2022-09-30T06:13:19+05:30 IST

పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాన్ని కప్పి పుచ్చుకునేందుకే మూడు మాసాలకొకసారి తుగ్లక్‌ నిర్ణయాలు

మూడు నెలలకో తుగ్లక్‌ పని
రెడ్డిగూడెం దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న దేవినేని ఉమా

 ఎన్టీఆర్‌ పేరు మార్పు అందులో భాగమే 

 జగన్‌పై మాజీమంత్రి ఉమా ఘాటు వ్యాఖ్యలు 

రెడ్డిగూడెం, సెప్టెంబరు 29 : పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాన్ని కప్పి పుచ్చుకునేందుకే మూడు మాసాలకొకసారి తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకుంటున్నాడని, అందులో భాగంగానే ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఆంధ్రుల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్‌ పేరును తొలగించారని ఏపీ జలవనరులశాఖ మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.  రెడ్డిగూడెంలో ఆయన గురువారం టీడీపీ నేతలతో కలిసి నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ పేరు తొలగింపును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబరు 3 తేదీ వరకు టీడీపీ శ్రేణులు నిరసనలు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలన్నారు. పేరు మార్పుపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. దీక్షలో ముప్పిడి నాగేశ్వర రెడ్డి, ఉయ్యూరు అంజిరెడ్డి, జానలపాటి వేణుగోపాలరెడ్డి  పాల్గొన్నారు. 

వత్సవాయి: ముఖ్యమంత్రి జగన్‌రెడ్గి తప్పులను దిద్దు కోకుంటే అధికారం నుంచి ప్రజలు తప్పించటం ఖాయమని విజయవాడ పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ అన్నారు.  వత్సవాయిలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యతో పాటు పలువురు రిలే దీక్షలు చేపట్టగా నెట్టెం ప్రారంభించి మాట్లాడారు.  హెల్త్‌ యూని వర్సీటీకి ఎన్టీఆర్‌ పేరు మార్చాలన్న నిర్ణయంతో జగన్‌కు నూరుతప్పులు నిండి పోయాయన్నారు.  తాతయ్య మాట్లాడుతూ ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్‌ అని,  హెల్త్‌ యూనివర్సిటీకి ఆ పేరు తొలగించి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడాన్ని ప్రజలు హర్షించటం లేదన్నారు.  మండల టీడీపీ అధ్యక్షుడు వడ్లమూడి రాంబాబు, జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి, కట్టా నరసింహారావు, గింజుపల్లి రమేష్‌, పెద్ది రామారావు, ఎన్‌.కోటేశ్వరరావు, తాళ్లూరి జనార్ధన్‌, బి.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్‌రెడ్డి తన పాలనలో రాష్ట్రాన్ని , ప్రజలను అప్పులు పాలు చేయటం, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయటం, ప్రభుత్వ పథకాలు పేరుమార్చటం తప్ప సాధించిందేమి లేదని నియోజవకర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మి విమర్శించారు.  వత్సవాయిలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఆధ్వ ర్యంలో  రిలే దీక్షా శిబిరాన్ని జగ్గయ్యపేట మునిసిపల్‌ కౌన్సిలర్లతో కలిసి సందర్శించి సంఘీభావం తెలిపారు.

నందిగామ :  టీడీపీ కార్యాలయంలోనాయకులు రిలే దీక్ష చేపట్టారు. ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని ఉప సంహరించుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.  ఏచూరి రామకృష్ణ, వడ్డెల్లి సాంబశివరావు, వీరంకి వీరాస్వామిపాల్గొన్నారు.



Updated Date - 2022-09-30T06:13:19+05:30 IST