ఆ సినిమా చూసి బాలికను హత్య చేశాను.. విచారణలో ఉపాధ్యాయుడి సంచలన వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2022-03-01T17:54:34+05:30 IST

రాజస్థాన్‌లోని కోటాలో కొన్ని రోజుల క్రితం జరిగిన 14 ఏళ్ల బాలిక హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా చూసి బాలికను హత్య చేశాను.. విచారణలో ఉపాధ్యాయుడి సంచలన వ్యాఖ్యలు!

రాజస్థాన్‌లోని కోటాలో కొన్ని రోజుల క్రితం జరిగిన 14 ఏళ్ల బాలిక హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన 14 ఏళ్ల బాలికను టీచర్ గౌరవ్ జైన్ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆ ఊరి నుంచి పరారయ్యాడు. గౌరవ్ కోసం కొన్ని రోజులుగా అన్వేషణ సాగిస్తున్న పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. విచారణలో గౌరవ్ సంచలన విషయాలు బయట పెట్టాడు. 


షారూక్ ఖాన్ సూపర్ హిట్ బాలీవుడ్ సినిమా `బాజీఘర్` సినిమా ప్రేరణతోనే తాను ఆ బాలికను హత్య చేసినట్టు గౌరవ్ పోలీసులకు చెప్పాడు. ఆ సినిమాలో షారూక్ హీరోయిన్‌తో పాటు పలువురిని చంపుతుంటాడు. ఆ సూపర్ హిట్ సినిమాను తెలుగులోకి రాజశేఖర్ హీరోగా `వేటగాడు` పేరుతో రీమేక్ చేశారు. `బాజీఘర్` సినిమా‌లో నటి రేష్మను షారూక్ చంపినట్టు తాను కూడా ఓ యువతిని చంపాలనుకున్నట్టు గౌరవ్ చెప్పాడు. 


`ఆ హత్య గురించి ఎన్ని రోజులుగానో ఆలోచిస్తున్నాను. హత్యకు రెండ్రోజుల ముందు నుంచి `బాజీఘర్` సినిమా చూస్తూనే ఉన్నాను. ఆ సినిమా తరహాలోనే ఆ బాలిక కాళ్లు, చేతులు కట్టేసి ఉరేసి చంపేశాన`ని గౌరవ్ పోలీసుల విచారణలో చెప్పాడు. హత్య తర్వాత గౌరవ్ కోటా నుంచి పరారయ్యాడు. మాస్క్ వేసుకుని పలు ఊర్లు తిరిగాడు. అలాగే మహిళల దుస్తులు ధరించి కొన్ని రోజులు తిరిగాడు. చివరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆరు రోజుల క్రితం అరెస్ట్ అయ్యాడు. 

Updated Date - 2022-03-01T17:54:34+05:30 IST