పులివెందుల నియోజకవర్గ ప్రజలు జగన్‌ను ఎందుకు ఓడించకూడదు?: తులసీరెడ్డి

ABN , First Publish Date - 2022-04-28T19:49:43+05:30 IST

పులివెందుల నియోజకవర్గ ప్రజలు జగన్‌ను ఎందుకు ఓడించకూడదని తులసీ రెడ్డి ప్రశ్నించారు

పులివెందుల నియోజకవర్గ ప్రజలు జగన్‌ను ఎందుకు ఓడించకూడదు?: తులసీరెడ్డి

అమరావతి: వచ్చే ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గ ప్రజలు జగన్‌ను ఎందుకు ఓడించకూడదని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కావించబడి మూడేళ్లు అయిందని, ఆ కేసు ఇంతవరకు అతీగతీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చెల్లెలు డాక్టర్ సునీత రెడ్డి రక్షణ కావాలంటూ కడప ఎస్పీకి లేఖ రాశారన్నారు. ఈ మూడేళ్ల కాలంలో పెద్ద కుడాల నాగమ్మ, పులివెందుల శివరానీ , వీరమ్మ, కోమన్నూతల మునెప్ప ఇలా ఎందరో హత్య కావించబడ్డారన్నారు. నియోజకవర్గంలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేదని, శాంతి భద్రతల వైఫల్యం ఒక్కటీ చాలదా జగన్‌ను ఓడించడానికి అని అన్నారు. 


పులివెందుల నియోజకవర్గం వ్యవసాయ ప్రధానమైనదని, సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టారని, పావలా వడ్డీ పథకానికి పాడే కట్టారని తులసీ రెడ్డి ఆరోపించారు. పంటల భీమా హుళక్కి, బిందు, తుంపర సేద్యం అటకెక్కిందన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మోటార్లు బిగిస్తారట! రగిలిపోతున్న రైతులు చాలరా జగన్‌ను ఓడించడానికి అని అన్నారు. పులివెందుల- కదిరి రోడ్డు మీద, వేంపల్లి- రాయచోటి రోడ్డు మీద ప్రయాణించిన ఏ ప్రయానికుడైనా జగన్‌కు ఓటు వేస్తారా? అని తులసీ రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2022-04-28T19:49:43+05:30 IST