స్టీల్ ప్లాంట్ అమ్మకం చరిత్రలోనే అతిపెద్ద స్కాం

ABN , First Publish Date - 2021-03-10T21:05:01+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం భారతదేశ చరిత్రలోనే

స్టీల్ ప్లాంట్ అమ్మకం చరిత్రలోనే అతిపెద్ద స్కాం

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి ఆరోపించారు. విశాఖ ఉక్కు అమ్మకం భలే మంచి చౌక బేరమని ఆయన అన్నారు. రెండు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని కేవలం 32,022 వేల కోట్ల రూపాయలకు ఏ విధంగా అమ్ముతారని ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంలో దాదాపు లక్షా 68 వేల కోట్ల రూపాయలు అవినీతి కుంభకోణం జరిగిందని తులసి రెడ్డి  ఆరోపించారు. బోఫోర్స్ విషయంలో కేవలం 64 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు మాత్రమే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-10T21:05:01+05:30 IST