కశ్మీర్ వెళుతున్నారా..? మీకో శుభవార్త

ABN , First Publish Date - 2022-03-23T01:57:03+05:30 IST

ఫోరిస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక శ్రద్ధతో ఈ ఏర్పాటు పర్యవేక్షిస్తోందట. పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారని, వారికి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లను చకచకా చేసేస్తున్నారు. గుల్మార్గ్, పహల్గామ్‌ రహదారులను కూడా ఇందుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు..

కశ్మీర్ వెళుతున్నారా..? మీకో శుభవార్త

శ్రీనగర్: ఆసియా ఖండంలోనే అతిపెద్ద తులిప్ వనం అందాలు ఈ ఏడాది కాస్త ముందుగానే చూపరులను అలరించనున్నాయి. కశ్మీర్ రాజధాని శ్రీనగర్ సమీపంలో ఉన్న ఈ గార్డెన్‌కు గతేడాది లక్షల్లో సందర్శకులు రావడం వల్ల ఈ ఏడాది మరింత ముందుగానే తులిప్ పండుగను ప్రారంభించి మరింత ఎక్కువ మంది సందర్శకులకు తులిప్ సువాసనలను అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు స్థానిక అధికారి తెలిపారు. మార్చి 23నే తులిప్ గార్డెన్‌ను సందర్శకులను అందుబాటులో ఉంచడానికి గార్డెనర్లు, లేబర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లు పని చేస్తున్నారని, అనుకున్న సమయానికి అందుబాటులోకి తీసుకు వస్తామని చెబుతున్నారు.


ఫోరిస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక శ్రద్ధతో ఈ ఏర్పాటు పర్యవేక్షిస్తోందట. పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారని, వారికి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లను చకచకా చేసేస్తున్నారు. గుల్మార్గ్, పహల్గామ్‌ రహదారులను కూడా ఇందుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఏడాది వసంతంలో తులిప్ గార్డెన్ అందాలు చూపరులను ఆకట్టుకుంటాయి. కానీ, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఇంకాస్త ముందుగానే తులిప్ పరిమళాలను ఆస్వాదించే అవకాశం సందర్శకులను దక్కనుంది.

Updated Date - 2022-03-23T01:57:03+05:30 IST