తుమ్మపాల షుగర్స్‌ జోలికొస్తే సహించం

ABN , First Publish Date - 2022-10-01T07:04:12+05:30 IST

తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ జోలికి వస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హెచ్చరించారు.

తుమ్మపాల షుగర్స్‌ జోలికొస్తే సహించం
రిలే నిరాహార దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద

  ఫ్యాక్టరీని విక్రయించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం 

 రిలే నిరాహార దీక్షా శిబిరంలో మాజీ ఎమ్మెల్యే ‘పీలా’ ఆరోపణ  

 పూర్తి స్థాయిలో ఆధునీకరించి నడిపించాలని డిమాండ్‌

 హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్పు నిర్ణయంపై ఆగ్రహం

తుమ్మపాల, సెప్టెంబరు 30 : తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ జోలికి వస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హెచ్చరించారు. ఎన్టీఆర్‌ విశ్వ విద్యాలయం పేరు మార్పును నిర    సిస్తూ తుమ్మపాలలో శుక్రవారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షా శిబిరంలో మాట్లాడారు. వేలాది మంది రైతులు, కార్మికులకు ఆధారంగా ఉన్న తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని వైసీపీ ప్రభు త్వం అమ్మాలని ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. గతంలో ఫ్యాక్టరీ ఆధునికీకరణకు రూ.30 కోట్లు నిధులు తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ, రైతులను దగాచేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై గ్రా మాల్లో రైతుల్లో అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం  చేశారు. తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని పూర్తిస్థాయిలో ఆధునీకరించి కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి పాలన రాక్షస పాల నను తలపిస్తుందన్నారు. అనాలోచిత నిర్ణయాలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ మాట్లాడుతూ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తన సొంత నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలను అమ్మా లని చూడడం దారుణమన్నారు. ధనార్జనకు అలవాటు పడిన వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారని మండిపడ్డారు.  ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం పేరు మార్పుపై ఆ పార్టీ  నాయకుల కుట్ర దాగి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందిన చినబాబు, కరణం శ్రీనివాసరావు, కర్రి బాబి, నడిపల్లి గణేష్‌, పచ్చికూర రాము, వియ్యపు సింహాచలంయాదవ్‌, కొణతాల శ్రీనివాసరావు, మరపురెడ్డి సత్యనారాయణ, సందిన సునీల్‌, తోటాడ విజయ్‌, నందారపు సూరిబాబు, మువ్వల అప్పలనాయుడు, సేనాపతి స్వరూప, గుడాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

  ‘షుగర్స్‌ రైతులను మోసం చేస్తే గుణపాఠం తప్పదు’

తుమ్మపాల : తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ రైతులను మోసగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే గుణపాఠం తప్పదని అనకాపల్లి వ్యవ   సాయదార్ల సంఘం ఉపాధ్యక్షుడు   విల్లూరి పైడారావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎన్నికల ముందు ఫ్యాక్టరీని తెరిపిస్తామని రైతులకు జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారని పేర్కొన్నారు.  ఇప్పుడు సీఎంతో పాటు పరి శ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ముఖం చాటేయడం దారుణమని తెలిపారు. రూ.400 కోట్లు ఆస్తి కలిగిన తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని పరిరక్షించి రైతులకు, కార్మికులకు అండగా ఉండాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-10-01T07:04:12+05:30 IST