జన జాతర

ABN , First Publish Date - 2020-11-30T04:04:36+05:30 IST

తుంగభద్ర పుష్కరాలకు భక్తులు పోటె త్తారు.

జన జాతర
అలంపూర్‌ ఘాట్‌ వద్ద పుష్కర స్నానాలు చేస్తున్న భక్తులు

- తుంగభద్ర పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

- ఆదివారం ఒక్క రోజే 60,294 మంది పుణ్య స్నానాలు

- పిండ ప్రదాన కేంద్రాల వద్ద క్యూ 

- అలంపూర్‌ ఘాట్‌ వద్ద తగ్గుతున్న నీరు

- రక్షణ కంచెను వెనక్కి జరుపాలంటున్న ప్రజలు


తుంగభద్ర నదీ తీరం జన సంద్రమైంది.. పుష్కరాల పదో రోజు సందర్భంగా ఆదివారం వేలాదిగా భక్తజనులు తరలి రావడంతో జన జాతరను తలపించింది.. ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఈ స్థాయిలో భక్తులు హాజరు కావడం ఇదే మొదటి సారి కావడంతో క్యూ లైన్లు కిక్కిరిసాయి.. పిండ ప్రదానాల కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో పోలీస్‌ అప్రమత్తమై నిఘాను పటిష్ఠం చేసింది.. వైద్య సిబ్బంది ప్రతి భక్తుడిని థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి ఘాట్ల వద్దకు అనుమతించింది..


(గద్వాల-ఆంధ్రజ్యోతి)/అలంపూర్‌/గద్వాల రూరల్‌, నవంబరు 29 : తుంగభద్ర పుష్కరాలకు భక్తులు పోటె త్తారు. సెలవు దినం కావడంతో ఆదివారం దాదాపు 60,294 మంది పుష్కర స్నానాలు ఆచరించారు. అందు లో అత్యధికంగా అలంపూర్‌ ఘాట్‌ వద్ద 26,391 మం ది, పుల్లూరులో 15,696, రాజోలిలో 13,107, వేణిసోంపురంలో 5,100 మంది హాజరైనట్లు అధికారులు తెలిపా రు. పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వర కు మొత్తం 2,38,317 మంది పుష్కర స్నానాలు ఆచ రించినట్లు చెప్పారు. సోమవారం కార్తీక పౌర్ణమి కావ డంతో భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుష్కరాల కు ఏపీలోని అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు జిల్లాలతో పాటు బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.


తగ్గుతున్న నీరు


శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి కోసం నీటిని ఎ క్కువగా విడుదల చేస్తుండడంతో తుంగభద్ర నదిలో బ్యాక్‌ వాటర్‌ తగ్గుతూ వస్తుంది. ఆదివారం అలంపూర్‌ ఘాట్‌ వద్ద దాదాపు రెండు ఫీట్ల మేరకు నీరు తగ్గిపో యింది. దీంతో భక్తులు వాటర్‌ బాటిళ్లు, మగ్గులతో స్నా నాలు చేశారు. అయితే, పుష్కరాలు మంగళవారం పూర్తి కానున్న నేపథ్యంలో నదిలో ప్రస్తుతం వేసిన రక్షణ కంచెను కొంత వెనుకకు జరిపితే భక్తులు స్నానా లు చేసుకునేందుకు వీలుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.


కిక్కిరిసిన పిండ ప్రదాన కేంద్రాలు


పుష్కర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అలంపూర్‌, పుల్లూరు, రాజోలి, వేణిసోంపురం ఘాట్ల వద్ద పిండ ప్రధానాల కోసం భక్తులు క్యూలో నిల్చుంటున్నారు. అయితే, కొందరు పిండ ప్రదానాలు చేయించేందుకు భక్తుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. విష యం తెలుసుకున్న అధికారులు వారిని హెచ్చరించారు.


పుష్కరాల్లో ప్రముఖులు


పుష్కరాలకు ప్రముఖులు తరలి వస్తున్నారు. ఆదివారం కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన స్వామి గురుకరుణామయ, ఏపీ విద్యా శాఖ వైస్‌ చైర్మన్‌ విజయారెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం, అలంపూర్‌ న్యాయమూర్తి రాధికా దంపతులు వేణిసోంపురం ఘాట్‌ వద్ద పుష్కర స్నానం ఆచరించారు. పుల్లూరు ఘాట్‌లో జోగుళాంబ ఆలయ కమిటీ చైర్మన్‌ రవిప్రకాష్‌గౌడ్‌, సర్పంచు నారాయణమ్మ పుష్కర స్నానాలు చేశారు.

Updated Date - 2020-11-30T04:04:36+05:30 IST