Advertisement

నిన్నటి దాకా కళకళ.. నేడు వెలవెల

Dec 2 2020 @ 22:48PM
పుష్కరాలు ముగియడంతో బుధవారం భక్తులు లేక బోసిపోయిన పుల్లూరు ఘాట్‌

- భక్తులు లేక వెలవెలబోయున ఘాట్లు 

- అమోఘంగా పారిశుఽధ్య కార్మికుల సేవలు

- విశ్రాంతిలో పుష్కర విధులు నిర్వహించిన ఉద్యోగులు


గద్వాల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : తుంగభద్ర పుష్కరాలు ముగియడంతో ఘాట్లన్నీ బోసిపోయాయి. 12 రోజుల పా టు భక్తులతో కిక్కిరిసిన ఘాట్లు ఆ మరు సటి రోజు నుంచి ఎవరూ లేకపోవడంతో వెలవెలబోయాయి. జోగుళాంబ గద్వాల జి ల్లాలోని అలంపూర్‌, పుల్లూరు, రాజోలి, వే ణిసోంపురం వద్ద ఘాట్లను ఏర్పాటు చే యగా, 12 రోజుల పాటు పుష్కర విధులు నిర్వహించిన సిబ్బంది బుధవారం సేద తీరారు. ఉత్సవాలు విజయవంతం కావడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


కిక్కిరిసిన ఘాట్లు


తుంగభద్ర పుష్కరాలను రెండు తెలుగు రాష్ర్టాల్లో నిర్వహించారు. అయితే, ఏపీలో మాత్రం పుష్కర స్నానం చేసే భక్తులు కే వలం షవర్ల కిందనే స్నానాలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిబంధన పెట్టింది. తె లంగాణలో మాత్రం నది స్నానంతో పాటు షవర్ల కింద స్నానాలు చేసే విధంగా ఏ ర్పాట్లు చేసింది. దీంతో ఏపీలోకంటే తెలం గాణలోని ఘాట్ల వద్దకే ఎక్కువగా భక్తులు తరలి వచ్చారు. ఉత్సవాలు ప్రారంభమైన మొదటి రోజు తెలంగాణలోని ఘాట్ల వద్ద కు మందకొడిగా భక్తులు రాగా, ఆ తరువా త కొంత రద్దీ పెరిగింది. మధ్యలో నివర్‌ తుపాన్‌ ప్రభావంతో రెండు రోజుల పాటు భక్తులు తగ్గిపోయారు. ఆ తరువాత తుపాన్‌ తెరిపి ఇవ్వ డంతో వేలాదిగా తరలి వచ్చారు. ఉత్సవా లు జరిగిన 12 రోజుల్లో కేవలం అలంపూర్‌ ఘాట్‌ వద్దే 1,99,553 మంది పుష్కర స్నా నాలు ఆచరించారు. పుల్లూరులో 79,226, రాజోలిలో 97,474, వేణిసోంపురంలో 33,728 మంది కలుపుకొని మొత్తం 4,09,981 మంది భక్తులు పుష్కరాలకు హాజరయ్యారు. పుష్కరాల సందర్భంగా పారిశుధ్య సి బ్బంది సేవలను అందరూ కొనియాడారు. ప్రతి ఘాట్‌ వద్ద చెత్తా చెదారం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. కా గా, బుధవారం పుల్లూరు ఘాట్‌ వద్ద కొం దరు చిన్నారులు నదిలో భక్తులు వేసిన చి ల్లరను సేకరిస్తూ కనిపించారు.

 
పుల్లూరు ఘాట్‌ వద్ద మంగళవారం పుష్కరాలకు హాజరైన భక్తులు

మూడు రోజులు రెస్ట్‌


పుష్కరాల సందర్భంగా దాదాపు 2,200 మంది పోలీసులతో పాటు సుమారు మూ డు వేల నుంచి నాలుగు వేల మంది వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఇతర ఉ ద్యోగులు విధులు నిర్వహించారు. మంగళవారం పుష్కరాలు ముగియడంతో పుష్కరాల వద్ద ఏర్పాటు చేసిన సామాగ్రిని సా యంత్రమే తరలించారు. బుధవారం ఘా ట్ల వద్ద ఎలాంటి సందడీ కనిపించలేదు. 12 రోజుల తరువాత అందరూ ఇళ్లకు చె రుకున్నారు. బుధవారం ఏ ఉద్యోగిని పలు కరించినా, ఈ రోజు విశ్రాంతిలో ఉన్నట్లు సమాధానమిచ్చారు. అలాగే పుష్కర విధు ల్లో పాల్గొన్న ఉద్యోగులకు మూడు రో జుల పాటు ఉన్నతాధికారులు సెలవులు మం జూరు చేశారు.

Follow Us on:
Advertisement