కలిసొచ్చిన కార్తీక మాసం

ABN , First Publish Date - 2020-12-04T03:48:13+05:30 IST

తుంగభద్ర పుష్కరాలు, కార్తీక మాసం ఒకేసారి రావడంతో పండుగ వాతావరణం నెలకొ న్నది.

కలిసొచ్చిన కార్తీక మాసం
పుల్లూరులో సరస్వతీ దేవి పల్లకీ సేవ (ఫైల్‌)

- అలంపూర్‌, రాజోలి, పుల్లూరు, వేణిసోంపురం గ్రామాలకు ప్రత్యేక గుర్తింపు

- అత్యధికంగా భక్తులు తరలి రావడంతో పెరిగిన ఆదాయం


గద్వాల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : తుంగభద్ర పుష్కరాలు, కార్తీక మాసం ఒకేసారి రావడంతో పండుగ వాతావరణం నెలకొ న్నది. ఒక వైపు పుష్కర స్నానం ఆచరిస్తూనే, మరోవైపు నదిలో కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపో యారు. ఇదే సమయంలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఐదో శ క్తిపీఠమైన అలంపూర్‌ జోగుళాంబ అమ్మవారిని దర్శించుకొని ప్ర త్యేక పూజలు చేశారు. పుల్లూరు, రాజోలి, వేణిసోంపురం గ్రామాలకు కూడా పుష్కరాలతో గుర్తింపు లభించింది.


రికార్డు స్థాయిలో ఆదాయం


పుష్కరాల సందర్భంగా అలంపూర్‌ ఘాట్‌ వద్దకే భక్తులు అధికంగా వచ్చారు. జిల్లాలో నాలుగు ఘాట్లు ఉండగా, ఈ ఘాట్‌ వద్దే ఎక్కువ మంది స్నానాలు ఆచరించారు. అనంతరం జోగు ళాంబ దేవి, బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ స మయంలో అలంపూర్‌ క్షేత్రానికి రికార్డు స్థాయిలో 12 రోజుల్లోనే రూ.88 లక్షల ఆదాయం వచ్చింది.


లక్ష తులసీ దళాలతో పూజ


సంగారెడ్డికి చెందిన జ్యోతిర్వాస్తు విద్యా పీఠం మహేశ్వరశర్మ సిద్దాంతి పుల్లూరు ఘాట్‌ వద్ద పుష్కర స్నానం ఆచరించారు. కా ర్తీక మాసం కావడంతో అక్కడే 300 మంది మహిళలతో కలిసి చె న్నకేశవ స్వామి ఆలయంలో లక్ష తులసీ దళాలతో పూజలు చే యడంతో గ్రామానికి కొత్త శోభ వచ్చింది. సర్పంచ్‌ నారాయణ మ్మతో పాటు దాతలు ఉత్సవాలకు వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు.


గంగమ్మ జాతర


రాజోలికి చెందిన మత్స్యకారులు ప్రతి ఏటా నవంబరు 29న తుంగభద్ర నదిలో గంగమ్మ జాతర నిర్వహిస్తారు. ఈ సారి నదికి పుష్కరాలు రావడంతో, పుష్కర స్నానాలు చేసి గంగమ్మ జాతరను జరుపుకున్నారు. అలాగే ఈ ఘాట్‌ వద్దకు వచ్చిన భక్తులకు మైనార్టీలు ఉచితంగా టీ, బిస్కెట్లు, తాగునీటిని ఉచితంగా సరఫరా చేశారు.


వేణిసోంపురానికి పుష్కర పండుగ


అపర మంత్రాలయంగా వేణిసోంపురం గ్రా మం ప్రసిద్ధికెక్కింది. ఈ ప్రాంతంలో తుంగభద్ర పుష్కరాలు కార్తీక మాసంలో రావడంతో ప్రత్యేకతను సంతరించుకున్న ది. ఇక్కడ నది ఒక భక్తుడి కోసం రెండు పాలయాలుగా ఏర్పడిన స్థలంగా కూడా వేణిసోంపురానికి పేరుంది. 

Updated Date - 2020-12-04T03:48:13+05:30 IST