Tungabhadra river: ఉప్పొంగుతున్న తుంగభద్ర

ABN , First Publish Date - 2022-09-08T17:47:13+05:30 IST

గత మూడు నాలుగు రోజలుగా కురుస్తున్న భారీ వర్షాల కాణంగా తుంగభద్ర(Tungabhadra) జలాశయం పూర్తి స్థాయిలో నిండి ఉప్పొంగుతోంది. రెండు

Tungabhadra river: ఉప్పొంగుతున్న తుంగభద్ర

- 28 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులకుపైగా నీరు విడుదల

- నదీతీర ప్రాంతాల్లో హై అలర్ట్‌


బళ్లారి(బెంగళూరు), సెప్టెంబరు 8: గత మూడు నాలుగు రోజలుగా కురుస్తున్న భారీ వర్షాల కాణంగా తుంగభద్ర(Tungabhadra) జలాశయం పూర్తి స్థాయిలో నిండి ఉప్పొంగుతోంది. రెండు నెలలుగా జలాశయం నుంచి లక్షలాది క్యూసెక్కుల వరద నీటిని నదికి వదులుతున్నారు. జలాశయంపై భాగంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో తుంగ, భద్ర నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు నదుల నుంచి వరద నీటిని నదికి వదులుతుండడంతో ఆ నీరంతా నేరుగా తుంగభద్ర జలాశయంలో చేరుతోంది. దీంతో జలాశయం భద్రతా దృష్ట్యా డ్యామ్‌ 33 క్రస్ట్‌గేట్లలో 20 గేట్ల 2.50 అడుగులు, మరో 8 గేట్లను 1.50 అడుగుల మేర ఎత్తి 1,04,755 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 104.262 టీఎంసీల నీరు నిలువ ఉండగా, లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుతున్నట్లు జలాశయం అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-09-08T17:47:13+05:30 IST