తుంగభద్ర పరవళ్లు

ABN , First Publish Date - 2022-08-09T05:28:07+05:30 IST

తుంగభద్ర జలాశయానికి వరద రోజురోజుకూ పెరుగుతోంది.

తుంగభద్ర పరవళ్లు


రాయదుర్గం, ఆగస్టు 8: తుంగభద్ర జలాశయానికి వరద రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం రాత్రి జలాశయానికి 1,27,034 క్యూసెక్కుల ఇనఫ్లో వస్తోంది. దీంతో జలాశయానికి ఉన్న 33 గేట్లలో 20 గేట్లు 2.5 అడుగులు, పది గేట్లు 1.5 అడుగులు, మూడు గేట్లు ఒక అడుగు ఎత్తి.. నదికి 1,03,069 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. జలాశయానికి అనుబంధంగా ఉన్న కాలువలకు వదిలే నీటితో కలిపి మొత్తం ఔట్‌ ఫ్లో 1,13,631 క్యూసెక్కులు. జలాశయం సామర్థ్యం 105 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 102.94 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. 

Updated Date - 2022-08-09T05:28:07+05:30 IST