Tungabhadra: నిండుకుండలా తుంగభద్ర

ABN , First Publish Date - 2022-09-09T17:48:53+05:30 IST

తుంగభద్ర(Tungabhadra) నిండుకుండలా దర్శనమిస్తోంది. లక్ష క్యూసెక్కుల ఔట్‌ప్లో మార్కును దాటి జలకళను సంతరించుకుంది.

Tungabhadra: నిండుకుండలా తుంగభద్ర

బళ్లారి(బెంగళూరు), సెప్టెంబరు 8: తుంగభద్ర(Tungabhadra) నిండుకుండలా దర్శనమిస్తోంది. లక్ష క్యూసెక్కుల ఔట్‌ప్లో మార్కును దాటి జలకళను సంతరించుకుంది. ఈఏడాది సాథారణ కంటే ఎక్కువ వర్షపాతం, నెలన్నర రోజులుగా డ్యాం పరివాహక ప్రదేశాలలో వానలు కురుస్తుండడంతో ఇన్‌ఫ్లో(Inflow) భారీగా పెరిగింది. గురువారం అధికారిక సమాచారం ప్రకారం 98,850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. వర్షాలు నిరంతరం కొనసాగితే మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. పీడన నియంత్రణ దృష్ట్యా రిజర్వాయర్‌ నుంచి 1.04లక్షల క్యూసెక్కు ల నీటిని విడుదల చేస్తున్నామని, నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నందున కంప్లి వంతెన మునిగిపో యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-09-09T17:48:53+05:30 IST