Compli Kote Bridge: శాంతించిన తుంగభద్ర

ABN , First Publish Date - 2022-08-14T17:45:07+05:30 IST

తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) నుంచి నదికు నీటి ప్రవాహం తక్కువ కావడంతో కంప్లి కోటె వంతెన(Compli Kote Bridge)పై నీరు

Compli Kote Bridge: శాంతించిన తుంగభద్ర

కంప్లి(బెంగళూరు), ఆగస్టు 13 : తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) నుంచి నదికు నీటి ప్రవాహం తక్కువ కావడంతో కంప్లి కోటె వంతెన(Compli Kote Bridge)పై నీరు తగ్గుముఖం పట్టి కంప్లి కోటె ప్రజలు, బెళుగోడుహాళ్‌, సన్నాపురం, ఇటిగి ప్రజలు కొద్దివరకు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం 80 వేలు నుంచి 90 వేల క్యూసెక్కుల మేర నీరు ప్రవహిస్తున్నాయి. భారీ వరద ప్రవాహానికి సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో బ్రిడ్జిపై నుంచి నీరు కిందకు తగ్గాయి. వంతెనకు ఇరువైపులా వుండే చెత్తాచెదారాన్ని తొలగించేందుకు కూడా పురసభ అధికారులు సిద్దమయ్యారు. పీడబ్ల్యూ అధికారుల సర్వే అనంతరమే రాకపోకలకు అవకాశం కల్పిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-08-14T17:45:07+05:30 IST