Advertisement

టూనీషియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి కొవిడ్ పాజిటివ్

Jan 25 2021 @ 09:51AM

టూనీస్ (టూనీషియా): టూనీషియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఒతమాన్ జెరాండీకి కరోనా వైరస్ సోకింది. ‘‘ఈ రోజు నేను చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.తనకు కొవిడ్ -19 లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని మంత్రి జెరాండీ చెప్పారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం నేను అన్ని రకాల ముందుజాగ్రత్తలు పాటించడంతోపాటు చికిత్స చేయించుకుంటున్నాను’’ అని జెరాండీ ఆదివారం అర్దరాత్రి ట్వీట్ చేశారు. కరోనా వైరస్ బారి నుంచి టూనీషియాను రక్షించడానికి కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మంత్రి చెప్పారు.కాగా కరోనా వైరస్ ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.టూనీషియా దేశంలో 1,97,000 కరోనా కేసులు నమోదు కాగా వీరిలో 1,44,000 మంది కోలుకున్నారు.6,200 మంది కరోనాతో కన్నుమూశారని టూనీషియా ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.