
టర్కీకి చెందిన ఓ వ్యక్తికి 14 నెలలుగా కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అవుతూనే ఉంది. 56 ఏళ్ల ముజాఫర్ కయాసన్ లుకేమియాతో బాధపడుతున్నాడు. అతనికి 2020 నవంబర్‌లో మొదటిసారిగా కరోనా సోకింది. అప్పటి నుంచి 78 సార్లు పరీక్షలు చేయించుకున్నాడు. 78 సార్లు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కయాసన్ తొమ్మిది నెలల పాటు ఆస్పత్రిలో ఉండగా, ఐదు నెలలు ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పటికీ ఐసొలేషనలోనే ఉన్నాడు. లుకేమియా కారణంగా రోగనిరోధకశక్తి బలహీనంగా ఉండడమే అతనికి ఇన్నిసార్లు కరోనా సోకడానికి కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి