Viral Video: మృగరాజును ఆటపట్టించిన తాబేలు..!

ABN , First Publish Date - 2022-04-15T17:22:25+05:30 IST

సింహాన్ని అడవికి రాజుగా అభివర్ణిస్తారు. సింహాన్ని చూసి అడవిలోని దాదాపు అన్ని జంతువులు భయపడతాయి. అది తమ వైపు వస్తే చాలు.. అక్కడ నుంచి జంతువులన్నీ ప్రాణ భయంతో పరుగులు తీస్తాయి. జంతువులను అంతగా భయపెట్టుం

Viral Video: మృగరాజును ఆటపట్టించిన తాబేలు..!

ఇంటర్నెట్ డెస్క్: సింహాన్ని అడవికి రాజుగా అభివర్ణిస్తారు. సింహాన్ని చూసి అడవిలోని దాదాపు అన్ని జంతువులు భయపడతాయి. అది తమ వైపు వస్తే చాలు.. అక్కడ నుంచి జంతువులన్నీ ప్రాణ భయంతో పరుగులు తీస్తాయి. జంతువులను అంతగా భయపెట్టుంచుకునే మృగరాజును ఓ చిన్న జీవి ఆటపట్టించింది. ఏకంగా దాని నోట్లేనే తల దూర్చేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం అందకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



దాహంతో అల్లాడుతున్న ఓ సింహం.. నీటి మడుగు కోసం గాలిచింది. ఈ క్రమంలోనే దానికి నీటి మడుగు కంట పడింది. ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడకు చేరుకున్న మృగరాజు.. ఒడ్డున కూర్చొని నీళ్లు తాగడం ప్రారంభించింది. ఈ క్రమంలో నీటి మడుగులో ఉన్న ఓ చిన్నపాటి తాబేలు.. నెమ్మదిగా ఈదుకుంటూ సింహం వద్దకు వెళ్లింది. అనంతరం తన తలను సింహం నోటి దగ్గర పెట్టి.. దానికి అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో సింహం మరో పక్కకు వెళ్లి నీళ్లు తాగుతుంది. అయితే ఆ తాబేలు మాత్రం సింహాన్ని వదలేదు. మాటిమాటికీ సింహానికి చిరాకు తెప్పించి.. మృగరాజును ఆటపట్టించింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. 




Updated Date - 2022-04-15T17:22:25+05:30 IST