సింగిల్ డ్యాడ్‌గా ఉండటం కష్టం.. సరి అయిన భాగస్వామి దొరికితే పెళ్లి చేసుకుంటాను : తుషార్ కపూర్

Published: Sun, 16 Jan 2022 17:52:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సింగిల్ డ్యాడ్‌గా ఉండటం కష్టం.. సరి అయిన భాగస్వామి దొరికితే పెళ్లి చేసుకుంటాను : తుషార్ కపూర్

బాలీవుడ్ దిగ్గజ నటుడు జితేంద్ర కపూర్, శోభా కపూర్‌ల తనయుడు తుషార్ కపూర్. పలు సినిమాల్లో హీరోగా నటించారు. అతడు సరోగసీ విధానంలో 2016లో లక్ష్య కపూర్ అనే బాబుకు తండ్రయ్యారు. తాజాగా అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. జీవిత భాగస్వామి లేకుండా పరిపూర్ణ జీవనాన్ని ఆస్వాదించలేమని అతడు చెబుతున్నారు. 


‘‘సరి అయిన భాగస్వామి దొరికితే పెళ్లి చేసుకునేందుకు నేను సిద్ధమే. జీవిత భాగస్వామిని మాత్రం వెతకడం లేదు. ప్రస్తుతం నేను పరిపూర్ణ జీవనాన్ని ఆస్వాదించడం లేదు. తండ్రిని కావడంతోనే నా జీవితం పూర్తయిందని భావించాను. సరి అయిన పని చేశానని అనుకున్నాను. నేను పరిపూర్ణ జీవితాన్ని ఆస్వాదించడం లేదని ఇతరులకు ఎప్పుడు చెప్పలేదు. విధి నా కోసం ఏమి దాచి ఉంచిందో తెలియదు’’ అని తుషార్ కపూర్ చెప్పారు. అతడి సోదరి ఏక్తా కపూర్ కూడా సరోగసీ ద్వారా ఒక బిడ్డకు తల్లయింది.  


తుషార్ కపూర్ తాను ఓ పుస్తకాన్ని రాస్తున్నట్టు గతేడాది డిసెంబర్‌లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘తండ్రి కావడం అనేది జీవితంలో అద్భుతమైన ఘట్టం. నేను ‘బ్యాచిలర్ డ్యాడ్’ అనే పుస్తకాన్ని రాశాను. ఈ పుస్తకంలో తండ్రి కావడానికి భిన్నమైన దారిని ఎంచుకోవడానికి గల కారణాలను వివరించాను. తండ్రి కాబోతున్న సమయంలో అనేక మంది నాకు మద్దతుగా నిలిచారు. నేను సింగిల్ డ్యాడ్‌గా ఉండే క్రమంలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇవ్వడానికి అనేక మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నేను ప్రయత్నించాను. కొంత మంది నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నా జీవితంలోని నిజాలన్నింటిని ఈ పుస్తకం ద్వారా బయటపెడతాను ’’ అని తుషార్ కపూర్ వెల్లడించారు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...