Pakistan Hindu Temple Restored: 1200 ఏళ్లనాటి హిందూ దేవాలయం పునరుద్ధరణ

ABN , First Publish Date - 2022-08-04T15:33:11+05:30 IST

పాకిస్థాన్(Pakistan) దేశంలో 1200 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయాన్ని(Old Hindu Temple) ఎట్టకేలకు పునరుద్ధరించనున్నారు....

Pakistan Hindu Temple Restored: 1200 ఏళ్లనాటి హిందూ దేవాలయం పునరుద్ధరణ

లాహోర్ (పాకిస్థాన్): పాకిస్థాన్(Pakistan) దేశంలో 1200 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయాన్ని(Old Hindu Temple) ఎట్టకేలకు పునరుద్ధరించనున్నారు. లాహోర్ నగరంలో కబ్జా పాలైన వాల్మీకి మందిరం సుదీర్ఘ న్యాయపోరాటంతో(Long Court Battle) పునరుద్ధరణకు(Restored) శ్రీకారం చుట్టారు. లాహోర్(Lahore) నగరంలోని అనార్కలీ బజారులో ఉన్న వాల్మీకి దేవాలయాన్ని ఓ క్రైస్తవ కుటుంబం(Christian family) కబ్జా చేసింది. దీంతో ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ETPB) న్యాయపోరాటం చేసి పురాతన దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది.పాకిస్థాన్ దేశంలో హిందువులు చేసిన న్యాయపోరాటం ఫలించి ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయి.


క్రైస్తవ కుటుంబం హిందూ మతాన్ని స్వీకరించి రెండు దశాబ్దాలుగా వాల్మీకి మందిరాన్ని(Valmiki Temple) కబ్జా చేసింది.పాకిస్థాన్ దేశంలో అతి పురాతనమైన వాల్మీకి మందిరాన్నిభవిష్యత్‌లో మాస్టర్ ప్లాన్ ప్రకారం పునరుద్ధరిస్తామని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్(Evacuee Trust Property Board) అధికార ప్రతినిధి అమీర్ హాష్మి చెప్పారు. కబ్జా చెర(grabbed) నుంచి పురాతన వాల్మీకి ఆలయాన్ని విడిపించి బుధవారం 100 మంది హిందువులు(Hindus), కొందరు సిక్కులు, క్రైస్తవ నాయకులు వాల్మీకి దేవాలయంలో పూజలు జరిపి అన్నదానం చేశారు.


ఓ క్రైస్తవ కుటుంబం ఈ దేవాలయాన్ని రెండు దశాబ్దాలుగా కబ్జా చేసింది. వాల్మీకి మందిరం స్థలాన్ని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ రెవెన్యూ రికార్డుల్లోకి బదిలీ చేశారు. కాని 2010వ సంవత్సరంలో ఈ ఆలయ భూమి తమదేనని ఓ క్రైస్తవ కుటుంబం సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసింది. దీంతో దేవాలయం భూ వివాదంపై కోర్టు విచారణ చాన్నాళ్లు సాగింది.క్రైస్తవ కుటుంబం దావాను కోర్టు తప్పు పిటిషన్ అని కొట్టివేసింది. 1992వ సంవత్సరంలో భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేత(Babri Masjid demolition) అనంతరం కొందరు ఆందోళనకారులు వాల్మీకి దేవాలయంపై దాడి చేసి కృష్ణ, వాల్మీకి విగ్రహాలను ధ్వంసం చేశారు. 


అప్పట్లో దేవాలయాన్ని కూల్చివేసి నిప్పు పెట్టడంతో కాలిపోయింది.దీనిపై హిందువులు కోర్టుకు వెళ్లడంతో పాకిస్థాన్ సుప్రీంకోర్టు(Supreme Court of Pakistan) ఏకసభ్య కమిషన్(one-man commission) ను నియమించింది.వాల్మీకి దేవాలయాన్ని పునరుద్ధరించి పాక్ హిందువులు(hindus in pakistan)(hindu population in pakistan) పూజలు చేసుకునేలా సౌకర్యాలు కల్పించాలని సుప్రీం నియమించిన ఏకసభ్య కమిషన్ పాక్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కోర్టులో వాల్మీకి దేవాలయ భూవివాదం కాస్తా సమసిపోవడంతో ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. కోర్టు ఆదేశాలు, పాక్ ప్రభుత్వ నిర్ణయంతో పురాతన వాల్మీకి మందిరం పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.  


Updated Date - 2022-08-04T15:33:11+05:30 IST