కవలలే కానీ.. వేరు వేరుగా పుట్టిన సంవత్సరాలు.. 2 మిలియన్లలో ఒకే ఒక్క ఛాన్స్..

ABN , First Publish Date - 2022-01-06T01:25:03+05:30 IST

అమ్మ కడుపు నుంచి ఒకే సమయానికి ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చిన పిల్లలను సాధారణంగా కవలలు అంటారు కదా. వేరు వేరు సంవత్సరాల్లో జన్మించిన పిల్లలను కవలలు అంటారేంటి ఆశ్చర్యపోతున్నారా? వైద్య నిపుణులు కూడా ఇదే అంటున్నారు

కవలలే కానీ.. వేరు వేరుగా పుట్టిన సంవత్సరాలు.. 2 మిలియన్లలో ఒకే ఒక్క ఛాన్స్..

ఎన్నారై డెస్క్: అమ్మ కడుపు నుంచి దాదాపు సమయానికి ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చిన పిల్లలను సాధారణంగా కవలలు అంటారు కదా. వేరు వేరు సంవత్సరాల్లో జన్మించిన పిల్లలను కవలలు అంటారేంటి ఆశ్చర్యపోతున్నారా? వైద్య నిపుణులు కూడా ఇదే అంటున్నారు. ఇలా జరగడానికి రెండు మిలియన్లలో ఒకే ఒక్క ఛాన్స్ ఉంటుందట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



కాలిఫోర్నియాకు చెందిన ఫాతిమాకు కొన్ని నెలల క్రితం గర్భం దాల్చింది. ఈ క్రమంలో డిసెంబర్ 31న రాత్రి వేళ ఆమెకు పురిటి నొప్పులొచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆమె డిసెంబర్ 31, 2021న రాత్రి 11.45 నిమిషాలకు ఆల్ఫ్రెడో ఆంటోనియో ట్రుజిల్లో‌ (మగ శిశువు)కు జన్మనిచ్చింది. ఆ తర్వాత 15 నిమిషాలకు ఐలిన్ యోలాండా ట్రుజిల్లో(ఆడ శిశువు)కు జన్మనిచ్చింది. 15 నిమిషాల్లో క్యాలెండర్ మారిపోవడం వల్ల.. ఆ కవలలకు వేరు వేరు సంవత్సరాలతో అధికారులు బర్త్ సర్టిఫికెట్లను జారీ చేశారు. తన పిల్లలకు వేరు వేరు ఏడాదులతో సర్టిఫికెట్లు జారీ అవడం పట్ల తొలుత కంగారుపడ్డ ఫాతిమా.. తర్వాత ఆనందం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే.. దీనిపై స్పందించిన వైద్య నిపుణులు.. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని పేర్కొన్నారు. ఇలా జరగడానికి రెండు మిలియన్లలో ఒకే ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంటుందని వెల్లడించారు. 




Updated Date - 2022-01-06T01:25:03+05:30 IST