వారిద్దరూ కవలలు.. కానీ వేర్వేరు సంవత్సరాల్లో జన్మించారు.. ఇది చాలా అరుదు

ABN , First Publish Date - 2022-01-05T05:57:35+05:30 IST

ప్రపంచంలో కవల పిల్లలు జన్నించడం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ వేర్వేరు సంవత్సరాల్లో జన్నించిన కవల పిల్లలు కూడా ఈ భూమి పైన ఉన్నారంటే ఆశ్చర్యం...

వారిద్దరూ కవలలు.. కానీ వేర్వేరు సంవత్సరాల్లో జన్మించారు.. ఇది చాలా అరుదు

ప్రపంచంలో కవల పిల్లలు జన్నించడం అరుదుగా చూస్తూ  ఉంటాం. కానీ వేర్వేరు సంవత్సరాల్లో జన్నించిన కవల పిల్లలు కూడా ఈ భూమి పైన ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. 


అమెరికాలోని ఓ జంటకు కవలలు జన్మించారు. కానీ, వారు వేర్వేరు నెలల్లోనే కాదు.. ఏకంగా వేర్వేరు సంవత్సరాల్లో జన్మించారు. అదెలాగంటే.. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఒక మహిళకు ప్రసవం జరిగింది. కానీ కొద్దిసేపటికే ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. కానీ మొదటి బిడ్డ 31వ తేదీ రాత్రి 11.45 గంటలకు, రెండవ బిడ్డ తదుపరి సంవత్సరం జనవరి 1 న 0.01 నిమిషానికి జన్మించింది. 


దీంతో ఇద్దరు పిల్లలు ఒకే కాన్పులో పుట్టినా.. 15 నిమిషాల తేడాతో వేర్వేరు సంవత్సరాల్లో జన్మించినట్టు అయింది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. కాగా.. ఇద్దరు కవలల్లో ఒకరు మగబిడ్డ కాగా మరో బిడ్డ పాప కావడం విశేషం. 


అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఫాతిమా మాడ్రిగల్, రాబర్ట్ ట్రుజిలో దంపతులకు ఈ కవలలు జన్నించారు.  2021 డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.45 గంటలకు ఫాతిమా మాడ్రిగల్ కొడుకు ఆల్‌ఫ్రెడోకు జన్మనివ్వగా.. 15 నిమిషాల తర్వాత అంటే.. 2022 జనవరి 1వ తేదీ తొలి నిమిషంలోనే ఆమెకు కూతురు అయిలన్‌కు జన్మించింది.


ఇలా వేర్వేరు సంవత్సరాల్లో కవల పిల్లలు పుట్టడంపై ఫాతిమా మాట్లుడుతూ "నాకు ఇద్దరు ట్విన్స్ పుట్టడం సంతోషంగా ఉంది. అందులోనూ వారిద్దరికీ వేర్వేరు బర్త్‌డేలు ఉండటం నా సంతోషాన్ని రెట్టింపు చేస్తున్నాయి. వీరిద్దరూ అర్ధరాత్రి లోకంలో అడుగుపెట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది" అని చెప్పింది.


ఇంతకుముందు 2019 డిసెంబర్‌లో కూడా ఇలాంటి  ఘటనే అమెరికాలో జరిగింది.  డాన్ గిలియమ్ 2019 డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.37 గంటలకు ఒక శిశువుకు జన్మనిచ్చింది. రెండో శిశువుకు 2020 జనవరి 1వ తేదీ 12.07 గంటలకు జన్మనిచ్చింది.

Updated Date - 2022-01-05T05:57:35+05:30 IST