ట్విట్టర్ బయోను మార్చేసిన అమరీందర్.. అందరిలోనూ ఉత్కంఠ!

ABN , First Publish Date - 2021-09-30T21:41:44+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్‌సింగ్ భవిష్యత్ కార్యాచరణ

ట్విట్టర్ బయోను మార్చేసిన అమరీందర్.. అందరిలోనూ ఉత్కంఠ!

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్‌సింగ్ భవిష్యత్ కార్యాచరణ ఏమిటో తెలియక అందరూ బుర్రలు బద్దలుగొట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌లో ఇంక ఎంతమాత్రమూ కొనసాగబోనని, అంతమాత్రాన భారతీయ జనతా పార్టీలో చేరేది లేదని ఇప్పటికే స్పష్టం చేసిన అమరీందర్ తాజాగా తన ట్విట్టర్ బయోను మార్చేయడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు కారణమైంది. ‘ఆర్మీ వెటరన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి సేవలు అందిస్తూనే ఉంటా’ అని ఆయన తన ట్విట్టర్ బయోను మార్చుకున్నారు. దీంతో ఆయన తర్వాత ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. 


‘‘ఇప్పటికైనా కాంగ్రెస్‌లోనే ఉన్నా, కానీ అందులో కొనసాగబోను’’ అని అమరీందర్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన మంగళవారం నాడే ఢిల్లీ వచ్చిన అమరీందర్ ఈ ఉదయం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు.


కాగా, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా చేయడంపై అమరీందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీనామాను డ్రామాగా కొట్టిపడేశారు. ఆయనతో స్థిరత్వం లేని మనషన్న విషయాన్ని ఆయన రాజీనామా బలపరుస్తోందని విమర్శించారు. 


Updated Date - 2021-09-30T21:41:44+05:30 IST