ట్విటర్ డీల్ త్వరలోనే ముగింపు... సోమవారం తర్వాత ప్రకటన ?

ABN , First Publish Date - 2022-04-26T02:10:02+05:30 IST

టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలోన్ మస్క్ప చేతికి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ త్వరలోనే చిక్కనుందా ?

ట్విటర్ డీల్ త్వరలోనే ముగింపు...  సోమవారం తర్వాత ప్రకటన ?

ఎలోన్ మస్క్ చేతికి రానున్న సోషల్ మీడియా దిగ్గజం..!

న్యూయార్క్ : టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలోన్ మస్క్ప చేతికి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ త్వరలోనే చిక్కనుందా ? మరో వారం రోజుల్లో ఈ డీల్ ముగియనుందా ? ఈ ప్రశ్నతకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. ఈ విక్రయ ప్రక్రియ చివరి దశలో ఉండడమే కాకుండా, సోమవారం నాటికి ఈ డీల్‌ ముగిసే అవకాశమున్నట్లు వినవస్తోంది. ట్విట్టర్ సోమవారం తరువాత ఈ ఒప్పందాన్ని ప్రకటించవచ్చునని వినవస్తోంది.


కాగా... ప్రస్తుతానికి చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. మస్క్ తన చివరి ఆఫర్‌గా పేర్కొన్న ట్విట్టర్ సంబంధిత మొత్తం వాటాను కొనుగోలు చేయడానికి $ 43 బిలియన్లను ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్ ముగిసినపక్షంలో...  టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్ షేర్లను ఒక్కొక్కటి $ 54.20 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్విటర్ షేర్‌హోల్డర్‌లకు లావాదేవీని సిఫార్సు చేయడానికి దాని బోర్డు సమావేశమైన నేపథ్యంలో...  సోమవారం తర్వాత $ 43 బిలియన్ల ఒప్పందాన్ని ప్రకటించవచ్చని వినవస్తోంది.

Updated Date - 2022-04-26T02:10:02+05:30 IST