twitter బోర్డు నుండి... మాజీ CEO జాక్ డోర్సేనిష్క్రమణ

ABN , First Publish Date - 2022-05-27T00:51:10+05:30 IST

Twitter CEO జాక్ డోర్సే ట్విట్టర్ బోర్డు నుండి వైదొలిగారు. టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలోన్ మస్క్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకునే ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

twitter బోర్డు నుండి...  మాజీ CEO జాక్ డోర్సేనిష్క్రమణ

లండన్ : Twitter CEO జాక్ డోర్సే ట్విట్టర్ బోర్డు నుండి వైదొలిగారు. టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలోన్ మస్క్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకునే ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి... ఇందుకు సంబంధించిన ప్రకటన నిన్ననే(బుధవారం)... అంటే... ట్విట్టర్ వార్షిక వాటాదారుల సమావేశాన్ని నిర్వహించిన అదే రోజే వెలువడింది. డోర్సే... 2006 లో సహ-స్థాపకునిగా ట్విట్టర్‌తో మొదలైన తన ప్రయాణాన్ని బుధవారం ముగించాడు. ఆయన 2007 నుండి డైరెక్టర్‌గా ఉండడంతోపాటు, కొంతకాలంగా CEOగా కూడా ఉన్నారు. వాస్తవానికి... నిరుడు జరిగిన స్టాక్‌హోల్డర్ల సమావేశంలో... డోర్సే తన  పదవీకాలం ముగిసేవరకు బోర్డులో కొనసాగుతారని కంపెనీ పేర్కొంది. ట్విట్టర్‌ను బిలియనీర్ ఎలోన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా... ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించాలా ? వద్దా ? అనే విషయమై వాటాదారు ఓటు ఇంకా వెలువడలేదు. త్వరలో ఇది జరగాల్సి ఉంది.

Updated Date - 2022-05-27T00:51:10+05:30 IST