మోదీ రాజీనామా చేయాలంటూ ట్విట్టర్‌లో హల్‌చల్

ABN , First Publish Date - 2022-06-16T00:51:20+05:30 IST

మోదీ రాజీనామా చేయాలంటూ ట్విట్టర్‌లో హల్‌చల్

మోదీ రాజీనామా చేయాలంటూ ట్విట్టర్‌లో హల్‌చల్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజీనామా చేయాలంటూ బుధవారం ట్విట్టర్‌లో నెటిజెన్లు పెద్ద ఎత్తున ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. #ModiMustResign అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ఇండియా ట్విట్టర్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌లో ఉంది. కాంగ్రెస్ సహా దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, లాయర్లు, మేధావులు, విద్యావేత్తలతో పాటు బీజేపీ విధానాల్ని వ్యతిరేకించే ఎంతో మంది ప్రముఖులు ఈ ట్రెండింగ్‌లో పాల్గొనడం విశేషం. శ్రీలంకలో అదాని ఒప్పందంపై రేగిన వివాదం ఈ ట్రెండింగ్‌లో పెద్ద ఎత్తున చర్చకు కేంద్రంగా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువగా రాహుల్‌ను మూడు రోజులుగా ఈడీ విచారిస్తుండడంపై చర్చిస్తున్నారు. ఇవే కాకుండా 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ చేసిన వాగ్దానాలు, మోదీ ఎనిమిదేళ్ల పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ మోదీనికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నోట్లరద్దు పర్యవసానాలు, కొవిడ్ నియంత్రణలోని వైఫల్యాలను చర్చకు తెస్తున్నారు. అలాగే బ్యాంకు రుణాల్ని ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిన వారిని బీజేపీనే మ్యానేజ్ చేసిందంటూ చాలా మంది మండిపడుతున్నారు.


#ModiMustResign ట్రెండింగ్‌లోని కొన్ని ట్వీట్లు

























Updated Date - 2022-06-16T00:51:20+05:30 IST