చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2022-08-10T06:27:18+05:30 IST

మంగాపురం కాలనీలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టుచేసి వారి నుంచి 14 తులాల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులు, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు వాచీలను స్వాధీనం చేసుకున్నారు.

చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
పోలీసులు స్వాధీనం చేసుకున్న చోరీసొత్తు

14 తులాల బంగారు, 250 గ్రాములు వెండి ఆభరణాలు స్వాధీనం... 

ఎంవీపీ కాలనీ, ఆగస్టు 9: మంగాపురం కాలనీలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టుచేసి వారి నుంచి 14 తులాల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులు, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీజోన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... 

మంగాపురం కాలనీలో నివాసముండే షేక్‌ పర్వీన్‌ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈనెల 3న పీఎం పాలెంలోని తన తల్లి వద్దకు వెళ్లారు. అయితే 6వ తేదీన ఆమె ఇంటి తలుపు తెరచి ఉండడాన్ని మరో పోర్షన్‌లో అద్దెకు ఉండే రామారావు గమనించి, ఆమెకు సమాచారం అందించాడు. ఆందోళనతో వచ్చిన ఆమె పరిశీలించగా బీరువాలో బంగారు, వెండి వస్తువులతో పాటు రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు వాచీలు పోయినట్టు గుర్తించింది. వెంటనే ఎంవీపీ జోన్‌ క్రైంస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి చోరీకి పాల్పడిన కొమ్మాదికి చెందిన మరడ సాయి (సోరపిట్టలు), వేపగుంటకు చెందిన బాదే షణ్ముఖరావులను అరెస్టుచేసి, వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మరడ సాయి మద్యం, గంజాయికి బానిసై తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటాడని పోలీసులు తెలిపారు. ఇతడు 2021లో ఎంవీపీ జోన్‌ పీఎస్‌ పరిధిలో 11 నేరాలకు పాల్పడ్డాడని, ఈ కేసుల్లో శిక్ష అనుభవించి, రెండు నెలల క్రితం బయటకు వచ్చాడని తాజాగా షణ్ముఖరావుతో కలిసి చోరీకి పాల్పడ్డాడని పేర్కొన్నారు. 


Updated Date - 2022-08-10T06:27:18+05:30 IST