Shocking video: ఆకాశంలో ఢీకొట్టుకుని నేలరాలిన రెండు విమానాలు.. ఆ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2022-09-26T23:49:09+05:30 IST

విమాన ప్రమాదాల వార్తల గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. అయితే విమాన ప్రమాదాలు కెమెరాకు చిక్కిన సందర్భాలు చాలా తక్కువ.

Shocking video: ఆకాశంలో ఢీకొట్టుకుని నేలరాలిన రెండు విమానాలు.. ఆ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

విమాన ప్రమాదాల వార్తల గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. అయితే విమాన ప్రమాదాలు కెమెరాకు చిక్కిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా జర్మనీ (Germany)లో జరిగిన ఓ ప్రమాదం మొత్తం కెమెరాలో రికార్డు అయింది.  జర్మనీలోని లెమునిజ్ ఎయిర్‌ఫీల్డ్‌లో గాలిలో ఉన్న రెండు జెట్‌లు ఢీకొన్నాయి. ఆ ఘటన మొత్తం కెమెరాలో రికార్డైంది. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. 


ఆకాశంలో విన్యాసాలు చేస్తున్న రెండు ఫైటర్ జెట్‌లు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. కొద్ది సేపటికి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఆ తర్వాత, రెండూ ఒకదానికొకటి చిక్కుకుని వేగంగా నేల వైపు దూసుకొచ్చి ఇళ్ల మధ్యలో పడ్డాయి. కొద్ది సేపటికి పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మరణించినట్లు అగ్నిమాపక శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. పైలట్లు ఇద్దరూ `మిర్రర్ ఫ్లైట్` కోసం శిక్షణ పొందుతున్నారని, వారిద్దరూ 2019లో వింటేజ్ ఏరోబాటిక్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నారని తెలిపారు.


Updated Date - 2022-09-26T23:49:09+05:30 IST