14వేల అడుగుల ఎత్తులో.. ప్రపంచంలోనే మొట్ట మొదటిసారి.. అత్యంత ప్రమాదకరమైన సాహసానికి సిద్ధమైన పైలెట్లు!

ABN , First Publish Date - 2022-04-22T22:15:04+05:30 IST

అమెరికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా అత్యంత ప్రమాదకరమైన సాహసానికి సిద్ధమయ్యారు. వేలాది అడుగుల ఎత్తులో తాము నడుపుతున్న విమానంలోంచి దూకడమే కాకుండా.. మ

14వేల అడుగుల ఎత్తులో.. ప్రపంచంలోనే మొట్ట మొదటిసారి.. అత్యంత ప్రమాదకరమైన సాహసానికి సిద్ధమైన పైలెట్లు!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా అత్యంత ప్రమాదకరమైన సాహసానికి సిద్ధమయ్యారు. వేలాది అడుగుల ఎత్తులో తాము నడుపుతున్న విమానంలోంచి దూకడమే కాకుండా.. మరొకరు నడుపుతున్న విమానాన్ని అందుకుని దాన్ని కంట్రోల్‌లోకి తీసుకోనున్నారు. అంతేకాకుండా ఆ ప్రక్రియనంతా లైవ్‌‌స్ట్రీమ్ చేయనున్నారు. ఇందకు సంబంధించిన వార్త ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారగా.. ఇంతకూ ఈ సాహసం చేయడానికి ముందుకొచ్చిన వ్యక్తులు ఎవరనే వివరాల్లోకి వెళితే..



అమెరికాకు చెందిన ల్యూక్ ఐకెన్స్, ఆండీ ఫారింగ్టన్‌లు ఇద్దరూ కజిన్స్. ప్రస్తుతం రెడ్‌బుల్ ఎయిర్‌ఫోర్స్ ఏవియేషన్‌లో పని చేస్తున్నారు. ఈ నెల 24న అంటే ఆదివారం రోజు ఈ ఇద్దరూ అత్యంత ప్రమాదకరమైన సాహసం ప్లేన్ స్వాప్ (గాల్లో ఉండగానే ఒకరికొకరు విమానాలను మార్చుకోవడం) చేసుకుందుకు రెడీ అయ్యారు. రెండు సెన్సా 182 సింగల్ సీటు విమానాల్లో 14వేల అడుగుల ఎత్తుకు వెళ్లి.. ఆ తర్వాత ఐకెన్స్, ఆండీ తమ తమ విమానాల నుంచి కిందకు దూకి ఎయిర్‌క్రాఫ్ట్‌లను మార్చుకుంటారు. ఈ పెలట్లు ఇద్దరూ విమానాల్లోంచి దూకడం, తిరిగి మరొక విమానాన్ని క్యాచ్ చేయడం.. వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకుని తిరిగి ల్యాండ్ అవడం.. ఇలా ఈ సాహసానికి సంబంధించిన అన్ని దృశ్యాలను లైవ్‌స్ట్రీమ్ కూడా చేయనున్నారు. ఈ విషయాన్ని రెడ్‌బుల్ ఎయిర్‌ఫోర్స్ కూడా అధికారికంగా ప్రకటించింది. కాలిఫోర్నియాలో ఈ ప్రక్రియ మొత్తం నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుందని వెల్లడించింది. ఇటువంటి ప్రమాదకర సాహసాలు చేయడం ఐకెన్స్, ఆండీలకు కొత్తేమీ కాదని పేర్కొంది.   




Updated Date - 2022-04-22T22:15:04+05:30 IST