జమ్మూకశ్మీరులో encounter..జేసీఓతో సహా ఇద్దరు ఆర్మీ జవాన్లకు గాయాలు

ABN , First Publish Date - 2021-10-15T15:44:53+05:30 IST

జమ్మూకశ్మీరులోని పూంచ్ సెక్టారులో సాయుధ దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన న్‌కౌంటర్‌లో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) తో సహా ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు...

జమ్మూకశ్మీరులో encounter..జేసీఓతో సహా ఇద్దరు ఆర్మీ జవాన్లకు గాయాలు

పూంచ్: జమ్మూకశ్మీరులోని పూంచ్ సెక్టారులో సాయుధ దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన న్‌కౌంటర్‌లో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) తో సహా ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూంచ్‌లోని మెంధర్ తహసీల్‌లోని బింబర్ గాలి గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతం పూంచ్,రాజౌరీ మధ్య అటవీ ప్రాంతంలో ఉంది.సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ అనంతరం ఉగ్రవాదులు రాజౌరి అడవుల్లో దాక్కున్నారని వెల్లడైంది. ఉగ్రవాదుల సంచారంతో రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 


నిర్దిష్ట సమాచారం ఆధారంగా పోలీసులు బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి క్రాల్ పోరాలోని రేషిగుండ్ అటవీప్రాంతంలో గాలించారు. ఈ గాలింపులో ఏకే 47 రైఫిల్, నాలుగు మ్యాగజైన్ లు, 720 రౌండ్లు, మూడు వైర్ లెస్ సెట్లు, ఐదు వైర్ లెస్ సెట్ యాంటెనాలు, మూడు చైనీస్ గ్రెనెడ్లు, 8 డిటోనేటర్లు, ఒక దిక్చూచి దొరికిందని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. 


Updated Date - 2021-10-15T15:44:53+05:30 IST