అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2022-01-18T05:22:07+05:30 IST

అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు భీమిలి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇన్‌స్పెక్టర్‌ వి.రామకృష్ణ తెలిపారు.

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు

భీమునిపట్నం, జనవరి 17: అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు భీమిలి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇన్‌స్పెక్టర్‌ వి.రామకృష్ణ తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్‌ ఆదేశాలతో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎస్‌ఐ డి.పద్మావతి, సిబ్బంది దాడులు చేసి ఎగువపేటలో అలమండ కొండ అనే మహిళను పట్టుకుని ఆమె నుంచి 20 మద్యం నిబ్‌ బాటిళ్లు, నాలువు బీరు సీసాలను, పాండ్రంగిలో మండల బంగారమ్మ అనే మహిళ వద్ద నుంచి ఎనిమిది మద్యం నిబ్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Updated Date - 2022-01-18T05:22:07+05:30 IST