180 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు

Published: Sun, 22 May 2022 01:05:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
180 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టుఅరకులోయలో పట్టుబడ్డ నిందితులతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

అరకులోయ, మే 21: అరకులోయ ఘాట్‌రోడ్డులో శనివారం 180 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ గణపతిబాబు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు అనంతగిరి-అరకులోయ ఘాట్‌రోడ్డులో కాపుకాచి గంజాయి తరలిస్తున్న కారును డముకు వద్ద పట్టుకున్నామన్నారు. అందులో అక్రమంగా తరలిస్తున్న 180 కిలోల గంజాయిని గుర్తించి, జి.మాడుగుల మండలం మద్దిగరువు గ్రామానికి చెందిన వెంకటరామ గురుప్రభు, కొఠారి ఈశ్వరరావులను అరెస్టు చేశామన్నారు. ఈ దాడిలో ఎస్‌ఐ రామారావు, ఏఎస్‌ఐ వీర్రాజు పాల్గొన్నారని ఆయన వివరించారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.